నీలగిరి, మార్చి 24 : నల్లగొండను క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓం పుట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా మంగళవారం చందంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ దశ వంద రోజుల కార్యక్రమంను అయన ప్రారంభించారు. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉచిత మొబైల్ ఏఐ చెస్ట్ ఎక్స్ రే స్క్రీనింగ్ క్యాంప్స్ ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను ఆయన కోరారు.
అనంతరం జిల్లాలో క్షయ నిర్మూలన కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి అవార్డులు, ప్రశంస పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ రాహుల్, డాక్టర్ దీప, వివిధ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ కృష్ణకుమారి, డాక్టర్ రవి ప్రసాద్, చందంపేట సర్పంచ్ మహ్మద్ సాదిక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రాజేష్, జిల్లా క్షయ నివారణ కార్యక్రమం సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.