క్షయ రహిత జిల్లా కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి : డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్
నల్లగొండను క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓం పుట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా మంగళవారం చందంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా క్షయ నివారణ అధికారి..
నీలగిరి, మార్చి 24 : నల్లగొండను క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓం పుట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా మంగళవారం చందంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ దశ వంద రోజుల కార్యక్రమంను అయన ప్రారంభించారు. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉచిత మొబైల్ ఏఐ చెస్ట్ ఎక్స్ రే స్క్రీనింగ్ క్యాంప్స్ ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను ఆయన కోరారు.
అనంతరం జిల్లాలో క్షయ నిర్మూలన కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి అవార్డులు, ప్రశంస పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ రాహుల్, డాక్టర్ దీప, వివిధ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ కృష్ణకుమారి, డాక్టర్ రవి ప్రసాద్, చందంపేట సర్పంచ్ మహ్మద్ సాదిక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రాజేష్, జిల్లా క్షయ నివారణ కార్యక్రమం సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

