Deva Katta | పవన్ కళ్యాణ్ దేవా కట్టా మూవీ రూమర్స్.. అదొక అద్భుతమైన కల అంటూ దర్శకుడి కామెంట్
Deva Katta | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ప్రభావం చూపలేకపోయిన నేపథ్యంలో, ఆయన తదుపరి ప్రాజెక్టులపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో, పవన్ కళ్యాణ్ , దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్లో కొత్త సినిమా రాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Deva Katta | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ప్రభావం చూపలేకపోయిన నేపథ్యంలో, ఆయన తదుపరి ప్రాజెక్టులపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో, పవన్ కళ్యాణ్ , దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్లో కొత్త సినిమా రాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీమ్, ప్రస్తుతం ఆయన ఎలాంటి కొత్త సినిమాలకు సంతకం చేయలేదని స్పష్టం చేసింది. ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తి చేయడంపైనే ఆయన దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ‘OG 2’తో పాటు మిగిలిన సినిమాలను పూర్తి చేయడంపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. అయితే దేవా కట్టాతో సినిమా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, భవిష్యత్తులో కొత్త ప్రాజెక్టులపై అధికారిక సమాచారం ఉంటే మాత్రమే ప్రకటిస్తామని పవన్ టీమ్ క్లియర్‌గా తెలిపింది.
ఇక ఈ వార్తలపై దర్శకుడు దేవా కట్టా కూడా స్పందించారు. అసలు ఈ రూమర్స్ ఎలా వచ్చాయో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్‌తో పని చేయడం నా చిరకాల కోరిక. గతంలో నేను తెరకెక్కించిన ‘రిపబ్లిక్’ సినిమాను కూడా ఆయనను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేశాను అని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ ఫిక్స్ కాలేదని, సరైన కథ దొరికితే భవిష్యత్తులో కలిసి పని చేసే అవకాశం ఉందని చెప్పారు. దేవా కట్టా ప్రస్తుతం రాజకీయ నేపథ్యం లేని కొత్త కథపై పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తన తదుపరి సినిమా పూర్తిగా భిన్నంగా ఉండబోతుందని సంకేతాలు ఇచ్చారు.
పవన్ కళ్యాణ్–దేవా కట్టా కాంబినేషన్‌పై వచ్చిన వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించినప్పటికీ, ఇప్పుడు అవి కేవలం రూమర్స్ మాత్రమేనని తేలడంతో కొంత నిరాశ వ్యక్తమవుతోంది. అయితే భవిష్యత్తులో ఈ కాంబినేషన్ సాకారం అవుతుందనే ఆశను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన కమిట్మెంట్స్ పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టినట్లు స్పష్టమైంది. కొత్త ప్రాజెక్టులపై త్వరపడకుండా, సరైన కథలు ఎంపిక చేసుకునే దిశగా ఆయన ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్‌లో ఓ రైతు ఆవేదన
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

