ఈపీఎఫ్ విత్‌డ్రా రిజెక్ట్ అయిందా..? అయితే ఇవి కారణం కావొచ్చు..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపీఎఫ్ఓ) మన జీతం నుంచి కొంత జమ చేసి మన భవిష్యత్ అవసరాల కోసం దాచిపెడుతుంది. మన అత్యవసర అవసరాల కోసం ఈపీఎఫ్ నుంచి మనం కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దవాఖానల ఖర్చులు, ఇంటిని మరమ్మతులు చేసుకునేందుకు, పిల్లల చదువుల కోసం, పెండ్లిళ్ల కోసం, వాహనం కొనుగోలు కోసం.. ఇలా ప్రత్యేక పరిస్థితుల్లో మనం జమ చేసుకున్న మొత్తంలో నుంచి కొంత విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతిస్తారు. మనం రిక్వెస్ట్ పంపిన తర్వాత 15 నుంచి 30 రోజుల్లోగా మనం రిజిస్టర్ చేసుకున్న బ్యాంకు అకౌంట్లోకి నగదు జమ అవుతుంది. అయితే, కొన్నిసార్లు మనం ఎంత పరీక్షగా పంపినా మన రిక్వెస్ట్ రిజెక్ట్ అవుతుంది. అందుకు కొన్ని కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.
మనం మన బ్యాంకు అకౌంట్ వివరాలు అన్నీ పీఎఫ్ఓ వద్ద నమోదుచేయాలి. లేనిపక్షంలో విత్‌డ్రా చేసుకునేందుకు రిక్వెస్ట్ పంపగానే అది రిజెక్ట్ అవుతుంది. అలాకాకుండా ఉండేందుకు మన సేవింగ్స్ అకౌంట్ బ్యాంకు నంబర్, ఆ బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడును తప్పనిసరిగా మన ఈపీఎఫ్ అకౌంట్‌కు జతచేయాలి. అదేవిధంగా మన బ్యాంకు అకౌంట్‌ను ఆధార్, పాన్‌తో లింక్ చేసి ఉంచాలి. అలాగే, ఈపీఎఫ్ అకౌంట్లో కూడా తప్పనిసరిగా ఆధార్ నంబర్‌ను, పాన్ నంబర్నుజత చేయాలి. మీ యూఏఎన్ వీటితో జత చేసి లేకుంటే మీ రిక్వెస్ట్ రిజెక్ట్ అవుతుందని గమనించాలి. ఈపీఎఫ్ వెబ్సైట్లో మన కేవైసీని ఎప్పటికప్పుడు తాజాగా ఉంచాలి. కేవైసీలో మనకు సంబంధించిన అన్ని వివరాలను అప్లోడ్ చేయడం తప్పనిసరి.
నగదు విత్‌డ్రాకు సింపుల్ ట్రిక్స్
ఎలాంటి ఆలస్యం జరుగకుండా మనం రిక్వెస్ట్ పంపిన వెంటనే మన అకౌంట్లోకి నగదు రావాలంటే కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటించాలి. ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఆన్లైన్ సర్వీసెస్ విభాగంలోని క్లెయిమ్స్ సెక్షన్లోకి వెళ్లి క్లిక్ చేయాలి. అక్కడ మన బ్యాంకు అకౌంట్ వివారాలు నమోదు చేయాలి. మన వివరాలు సరిపోయిన తర్వాత టర్మ్స్ అండ్ కండీషన్స్ ఒప్పుకొంటూ ముందుకెళ్లాలి. ఇక్కడ ఏ కారణాల చేత నగదు విత్‌డ్రా చేస్తున్నావో తెలియజేయాలి. అనంతరం మన చిరునామా, బ్యాంకు చెక్కు లేదా పాస్బుక్కు కాపీని అప్లోడ్ చేయాలి. ఇక్కడ కూడా నిబంధనలకు ఓకే చెప్పిన తర్వాత మన ఆధార్ నంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయగానే దరఖాస్తు సబ్మిషన్ పూర్తవుతుంది. మన దరఖాస్తు ఎక్కడ వరకు వచ్చింది అనేది తెల్సుకునేందుకు ట్రాకింగ్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. ఎన్ని రోజుల్లో నగదు మన అకౌంట్లో జమ అవుతుందో కూడా చూచాయిగా తెలియజేస్తుంది. మన బ్యాంకు అకౌంట్లో మార్పులుగానీ, ఆధార్ నంబర్లో పొందుపరిచిన చిరునామాగానీ మారినట్లయితే.. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు కేవైసీ సరిచూసుకోవడం ఉత్తమం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

