మనలో ప్రతిభ ఉంటే, అది ఇవాళ కాకపోయినా రేపైనా ప్రపంచానికి తెలుస్తుంది. అందుకు ఉదాహరణ బెంగళూరు అమ్మాయి అనూరాధ భౌమిక్. తను ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్. ప్రస్తుతం తన ఎంబ్రాయిడరీ వర్క్స్‌తో ప్రపంచాన్నే ఆకట్టుకుంటున్నది.
‘#బుక్‌క్లబ్ #లిటరేచర్ఆన్కాన్వాస్’ పేరుతో బాత్‌టబ్‌లో పుస్తకం చదువుతున్న ఒక అమ్మాయి ఎంబ్రాయిడరీ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అది అమెరికన్ నటి ఎమ్మా రాబర్ట్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అనూరాధ పోస్ట్‌ను ఎమ్మా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. అంతే, నిమిషాల్లోనే అనూరాధకు కొనుగోలుదారుల నుంచి సంప్రదింపులు మొదలయ్యాయి. ‘నిఫ్ట్‌లో డిగ్రీ తర్వాత గార్మెంట్ కంపెనీలో ఉద్యోగం చేసేదాన్ని. ఈ మధ్యే ఫుల్‌టైమ్ ఆంత్రప్రెన్యూర్‌గా మారాను. కస్టమర్లు నాకు సోషల్ మీడియా, వెబ్సైట్ ద్వారా ఆర్డర్లు ఇస్తారు. కొందరు థీమ్ చెప్తే, మరికొందరు ఫొటోలు పంపిస్తారు. దాన్నిబట్టి ఎంబ్రాయిడరీ చేసి పంపుతా’ అని చెబుతున్నది అనూరాధ.