హైదరాబాద్, మే 14: రాష్ర్టానికి చెందిన ఎంటార్ టెక్నాలజీ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల నుంచి రూ.34 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఈ ఆర్డర్లలో భాగంగా క్లీన్ ఎనర్జీతోపాటు ఏరోస్పేస్ రంగాలకు సంబంధించి ఇంజినీరింగ్ ఉత్పత్తులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా సరఫరా చేయాల్సివుంటుందని కంపెనీ ఎండీ పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌లోనే తొమ్మిది యూనిట్లు ఉన్నాయి.