పోలీసు అభ్యర్థులకు సర్కార్ వంచన
రాష్ట్రంలో ఖాళీ ఉన్న 25 వేల పోలీసు ఉద్యోగాలకు కేవలం ఏడువేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ పోలీసు అభ్యర్థులను దారుణంగా వంచించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాత్రింబవళ్లు శ్రమిస్తూ పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని మండిపడ్డారు. శనివారం హరీశ్‌రావును హైదరాబాద్ నివాసంలో పలువురు పోలీసు ఉద్యోగ అభ్యర్థులు, నిరుద్యోగులు కలిశారు.
- ఏడువేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం శోచనీయం
- మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీ ఉన్న 25 వేల పోలీసు ఉద్యోగాలకు కేవలం ఏడువేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ పోలీసు అభ్యర్థులను దారుణంగా వంచించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాత్రింబవళ్లు శ్రమిస్తూ పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని మండిపడ్డారు. శనివారం హరీశ్‌రావును హైదరాబాద్ నివాసంలో పలువురు పోలీసు ఉద్యోగ అభ్యర్థులు, నిరుద్యోగులు కలిశారు.
వినతిపత్రం అందజేసి గోడు వెళ్లబోసుకున్నారు. ఖాళీలన్నీ భర్తీచేస్తామని ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం తమను నిలువునా ముంచిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఈ ప్రభుత్వానికి కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఉద్యోగాల జాతర అంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేపి, ఓట్లు వేయించుకుని, ఇప్పుడు ద్రోహం చేసిందని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

