ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. మంచి టచ్‌లో కనిపించిన తన మార్కు కవర్ డ్రైవ్‌లతో ఖాతా తెరిచిన అతను.. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించాడు. కానీ బెన్ స్టోక్స్ వేసిన బంతి ఊహించని విధంగా ఎక్స్ట్రా బౌన్స్ అవడంతో ఏం చెయ్యలేక పెవిలియన్ చేరాడు.
దీనిపై భారత మాజీ లెజెండరీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించాడు. ఆ డెలివరీ విషయంలో కోహ్లీ చేసేదేం లేదని జహీర్ తేల్చేశాడు. ‘‘కోహ్లీ ఒక గుడ్ డెలివరీ ఎదుర్కొన్నాడు. అంతకుమించి ఆ అవుట్ గురించి ఏం చెప్పడానికి లేదు. ఒక మంచి డెలివరీతో మనల్ని ఒక బౌలర్ అవుట్ చేస్తే.. ఇక దానిలో విశ్లేషించడానికి ఏముంది?’’ అని ప్రశ్నించాడు.
అదే సమయంలో మరికొందరు మాజీలు మాట్లాడుతూ.. కోహ్లీ క్రీజులో కుదురుకున్నాడని అనుకున్న ప్రతిసారీ ఆడటం అసాధ్యమైన బంతులు ఎదుర్కొంటున్నాడని, అతని అదృష్టం అస్సలు బాగలేదని అంటున్నారు. మరి తర్వాత టీ20, వన్డేల్లో అయినా కోహ్లీ తన మార్కు ఆటతో మంచి స్కోరు చేస్తాడేమో చూడాలి.