ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి విజయం
టీజీఎస్ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడ్డాయి. ఇందులో అత్యధిక ఓట్లు సాధించిన ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)ను రాష్ట్ర గుర్తింపు సంఘంగా కార్మిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీకి అధికారిక లేఖ పంపింది. ఈయూకు మొత్తం 18,276 ఓట్లు రాగా.. రెండోస్థానంలో నిలిచిన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు 13,556 ఓట్లు వచ్చాయి.
- అధికారికంగాఎన్నికల ఫలితాలు విడుదల
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): టీజీఎస్ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడ్డాయి. ఇందులో అత్యధిక ఓట్లు సాధించిన ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)ను రాష్ట్ర గుర్తింపు సంఘంగా కార్మిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీకి అధికారిక లేఖ పంపింది. ఈయూకు మొత్తం 18,276 ఓట్లు రాగా.. రెండోస్థానంలో నిలిచిన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు 13,556 ఓట్లు వచ్చాయి. మెజారిటీ యూనియన్ను గుర్తించేందుకు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్‌ను నియమించి ఈ ప్రక్రియ చేపట్టారు. ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్ (15), బహుజన వర్కర్స్ యూనియన్(320), కార్మిక సంఘ్(193), బహుజన కార్మిక యూనియన్(259), టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (35), తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్(1315), చెల్లని ఓట్లు 130 కలిపి మొత్తం 34,421 ఓట్లు పోలైనట్టు తెలిపారు. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ ఆర్టీసీకి జారీచేసిన ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఎంప్లాయీస్ యూనియన్‌కు రెండేండ్ల పాటు గుర్తింపు వర్తిస్తుందని పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

