‘సర్’ వ్యతిరేక నిరసనలో పరకాల ప్రభాకర్
సర్ పేరుతో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు నిరసనగా ‘హర్ గలీ మే జంతర్ మంతర్' (ప్రతి వీధిలోనూ ఒక జంతర్ మంతర్) పేరుతో ఈ నెల 23న జరిపే దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ పాల్గొననున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, నటుడు ప్రకాశ్ రాజ్, సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, రైతు నేత రాకేశ్ టికాయత్, ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా, రచయిత తుషార్ గాంధీలతో ఆయన వేదికను పంచుకుంటారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: సర్ పేరుతో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు నిరసనగా ‘హర్ గలీ మే జంతర్ మంతర్’ (ప్రతి వీధిలోనూ ఒక జంతర్ మంతర్) పేరుతో ఈ నెల 23న జరిపే దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ పాల్గొననున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, నటుడు ప్రకాశ్ రాజ్, సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, రైతు నేత రాకేశ్ టికాయత్, ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా, రచయిత తుషార్ గాంధీలతో ఆయన వేదికను పంచుకుంటారు.
ఈ ఆందోళనలో పాల్గొనాలని ఇండియా కూటమికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. అయితే వారి నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని సీజేపీ వర్గాలు తెలిపాయి. జంతర్ మంతర్‌లో నిరసనలు చేపట్టరాదంటూ ప్రభుత్వం నిషేధం విధించడంతో ఈ నెల 23న దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నవారు అక్కడే జాతీయ జెండాలు చేతబట్టి సర్‌పై నిరసన చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

