దీప్తి పసిడి పరుగు
పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. బరిలోకి దిగడమే ఆలస్యం అన్నట్టు పోటీపడ్డ ప్రతి ఈవెంట్లోనూ మెడల్స్ కొల్లగొడుతూ సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అయితే దేశానికి మెడల్స్ వెల్లువలా వస్తున్నాయి. మూడో రోజు అన్ని క్రీడల్లో కలిపి 27 పతకాలు రావడం గమనార్హం. ఇందులో 5 స్వర్ణాలు, 11 రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. ఆటల రెండో రోజు తెలంగాణ అమ్మాయి దీప్తి జీవాంజి పసిడి పరుగుతో అదరగొట్టగా మూడో రోజు రాష్ర్టానికే చెందిన బానోత్ అకీరా రజతం గెలుచుకోవడం విశేషం.
- పారా ఆసియా క్రీడల్లో వరుసగా రెండో స్వర్ణం..
- బానోత్ అకీరాకు రజతం
- ఆసియాడ్‌లో సత్తాచాటిన తెలంగాణ అథ్లెట్లు
- మూడో రోజు ఐదుగురికి బంగారు పతకాలు
పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. బరిలోకి దిగడమే ఆలస్యం అన్నట్టు పోటీపడ్డ ప్రతి ఈవెంట్లోనూ మెడల్స్ కొల్లగొడుతూ సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా
ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అయితే దేశానికి మెడల్స్ వెల్లువలా వస్తున్నాయి. మూడో రోజు అన్ని క్రీడల్లో కలిపి 27 పతకాలు రావడం గమనార్హం. ఇందులో 5 స్వర్ణాలు, 11 రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. ఆటల రెండో రోజు తెలంగాణ అమ్మాయి దీప్తి జీవాంజి పసిడి పరుగుతో అదరగొట్టగా మూడో రోజు రాష్ర్టానికే చెందిన బానోత్ అకీరా రజతం గెలుచుకోవడం విశేషం.
నగోయా: పారా ఆసియాడ్‌లో తెలంగాణ అథ్లెట్లు సత్తాచాటారు. ట్రాక్‌పైకి వస్తే పతకమే లక్ష్యంగా పతకాలు సాధిస్తున్న తెలంగాణ అమ్మాయి దీప్తి జీవాంజి, బానోత్ అకీరా మరోసారి రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ క్రీడా వేదికపై సగర్వంగా చాటిచెప్పారు. జపాన్‌లో జరుగుతున్న మూడో ఎడిషన్ పారా ఆసియా క్రీడల్లో దీప్తి.. మహిళల 400 మీటర్ల (టీ20 కేటగిరీ) పరుగు పందెంలో పాత రికార్డుల బూజు దులుపుతూ వరుసగా ఈ క్రీడల్లో రెండోసారి బంగారు పతకాన్ని అందుకుంది. రేసును 56.36 సెకన్లలోనే పూర్తిచేసి పసిడి పతకాన్ని దక్కించుకున్న ఈ వరంగల్ అమ్మాయి.. గత ఎడిషన్ (హాంగ్జౌ)లో తానే నెలకొల్పిన 56.59 సెకన్ల రికార్డును బద్దలుకొట్టి బంగారు పతకాన్ని నిలబెట్టుకుంది. దీప్తిది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం.
ఈ రేసులో జపాన్ అమ్మాయిలు నీనా కన్నూ (58.92 సె.) రజతం గెలవగా అకానె కటొ (1:00.26 సె.) కాంస్యం సాధించింది. ఇక ఆటల మూడో రోజు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు పతకాల పంట పండించారు. ఏకంగా ఐదుగురు పసిడి కాంతులు పంచారు. పురుషుల 400 మీటర్ల ఈవెంట్ (టీ38)లో వరంగల్‌కే చెందిన అకీరా 51.25 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రజతం గెలుచుకున్నాడు. మొత్తంగా మూడోరోజు భారత్ 27 పతకాలు సాధించడం గమనార్హం. అథ్లెటిక్స్‌తో పాటు పారా ఆర్చరీ, స్విమ్మింగ్, పవర్‌లిఫ్టింగ్‌లోనూ మన ప్లేయర్లు పతకాలు నెగ్గారు.

Banothu Akira
వెండి వెలుగులు
అథ్లెటిక్స్‌లో వెండి వెలుగులు పంచినవారి (8 మంది)లో బాంటీ (మెన్స్ హైజంప్ టీ44/64), భాగ్యశ్రీ జాదవ్ (విమెన్స్ షాట్‌పుట్ ఎఫ్34), యాసిర్ (షాట్‌పుట్), మన్జీత్ (మెన్స్ జావెలిన్ ఎఫ్12/13), ప్రీతి పాల్ (విమెన్స్ 100 మీటర్స్ టీ35), మహ్మద్ బాసిల్ (మెన్స్ 100 మీ. టీ47), అకీరా, శరత్ (మెన్స్ 1500 మీ. టీ12/13) ఉన్నారు.
కంచు మోత మోగించి..
ట్రాక్ అండ్ ఫీల్డ్ వివిధ క్రీడాంశాల్లో బుధవారం తొమ్మిదిమంది కాంస్యాలు సాధించారు. వారిలో అనుభవ్ చౌదరి (మెన్స్ 100 మీ. టీ-35), ప్రవీణ్ (మెన్స్ షాట్‌పుట్, ఎఫ్ 46), రాకేశ్భాయ్ (మెన్స్ 100 మీ. టీ37), రవి (మెన్స్ షాట్‌పుట్ ఎఫ్40), సుఖ్చియాన్ (మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్55), ప్రణవ్ దేశాయ్ (మెన్స్ 100 మీ. టీ64), శైలేష్ కుమార్ (మెన్స్ లాంగ్ జంప్ టీ42/61/63), కరమ్జ్యోతి (విమెన్స్ డిస్కస్ ఎఫ్55), హనీ (మెన్స్ డిస్కస్ త్రో ఎఫ్37) కంచు మోత మోగించారు.
శీతల్‌కు రజతం
రెండు చేతులు లేకున్నా ఆర్చరీలో సంచలనాలు నమోదుచేస్తున్న యువ ఆర్చర్ శీతల్ దేవీ, సహచర ఆర్చర్ పాయల్ నాగ్‌తో కలిసి మహిళల కాంపౌండ్ డబుల్స్ విభాగంలో రజతం నెగ్గింది. ఫైనల్లో భారత ద్వయం 141-150తో చైనా ఆర్చర్లకు స్వర్ణం కోల్పోయారు. కాగా రికర్వ్ మిక్స్డ్ టీమ్ (డబ్ల్యూ1) ఈవెంట్లో స్వాతి చౌదరి-మహ్మద్ నాజిర్ జోడీ సెమీస్‌లో 2-6తో కొరియా ఆర్చర్ల చేతిలో ఓడిపోయారు.
స్విమ్మింగ్‌లో..
ఈత పోటీల్లో పారా స్విమ్మర్ రవికార్తీక్ ఈ ఎడిషన్‌లో వరుసగా రెండో రజతాన్ని సాధించాడు. మెన్స్ 100 మీటర్స్ బ్యాక్‌స్ట్రోక్ ఎస్13 ఈవెంట్ ఫైనల్లో అతడు 1:10.10 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. మెన్స్ సింగిల్స్ ఎస్ఎల్4 విభాగంలో సుహాస్, నవీన్, శివకుమార్, అభిజీత్ సెమీస్‌కు చేరి పతకాలు ఖాయం చేశారు. పారా పవర్‌లిఫ్టింగ్‌లో కస్తూరి రాజమణి మహిళల 67 కిలోల కేటగిరీలో సిల్వర్ గెలిచింది. మెన్స్ బ్యాడ్మింటన్ ఎస్ఎల్4 కేటగిరీలో కృష్ణ-శివరాజన్ జోడీ రజతం దక్కించుకుంది.
అథ్లెటిక్స్‌లో తగ్గేదేలే!

రెండ్రోజులూ పతకాల మోత మోగించిన భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు మూడో రోజూ అదే జోష్ కనబరిచారు. మూడో రోజు దేశం ఖాతాలో ఐదు స్వర్ణాలు రాగా అవన్నీ అథ్లెటిక్స్‌లో వచ్చినవే కావడం విశేషం. సిమ్రన్ శర్మ, ప్రవీణ్ కుమార్, సచిన్ ఖిలారి, దిలీప్ గవిట్, అయూశ్ వర్మ గోల్డ్ మెడల్స్ కొట్టారు. విమెన్స్ 100 మీటర్స్ రేసు (టీ12)లో సిమ్రన్ శర్మ 12.02 సె.లో గమ్యాన్ని ముద్దాడి ఈ టోర్నీలో వరుసగా రెండో గోల్డ్ కొట్టింది. రెండోరోజు ఆమె 200 మీటర్ల రేసులోనూ స్వర్ణం నెగ్గడం విశేషం. 24 గంటల వ్యవధిలోనే ఆమె రెండు బంగారు పతకాలు గెలుచుకుంది. మెన్స్ హై జంప్ (టీ44/64 కేటగిరీ)లో ప్రవీణ్ 2.05 మీటర్లు ఎత్తుకు ఎగిరి గేమ్స్ రికార్డు (పాత రికార్డు 2.02 మీ.)ను సృష్టించి వరుసగా రెండో ఆసియాడ్‌లో స్వర్ణాన్ని గెలిచాడు. మెన్స్ షాట్‌పుట్ (ఎఫ్ 53)లో అయుశ్ వర్మ 8.16 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ నెగ్గాడు. మెన్స్ షాట్‌పుట్ (ఎఫ్ 46)లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఫైనల్లో సచిన్ 15.87 మీ. త్రో తో తొలి స్థానంతో స్వర్ణం నెగ్గగా మహ్మద్ యాసిర్ (15.06) రజతం, ప్రవీణ్ (14.94) కాంస్యం గెలుచుకున్నారు. మెన్స్ 100 మీటర్ల రేసులో దిలీప్ (టీ46/47) 10.69 సెకన్లలో రేసును పూర్తిచేసి పసిడిని ముద్దాడాడు.

Sheetal
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

