Employees Protest | తహసీల్ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన
Employees Protest | ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు.
మాగనూరు : ఎన్నికల సమయంలో ( Election Promises ) ప్రభుత్వ ఉద్యోగులకు ( Employees ) ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించిన నిరసన ( Protests ) తెలిపారు. మాగనూరు, కృష్ణ తహసీల్ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు నెలకు రూ.700 కోట్లు విడుదల చేసిన ఇంకా దాదాపు 13వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని ఏక మొత్తంలో వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య కార్డుల మంజూరీలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యాన్ని భరించలేకపోతున్నామని పేర్కొన్నారు.
మే 1వ తేదీ నుంచి కొత్త ఈహెచ్ఎస్ స్కీం విధి విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెండవ పీఆర్సీని అమలు చేయాలని , పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

