Eluru Ganganamma | ఏలూరు గంగానమ్మ ఆంథెమ్.. యూట్యూబ్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న భక్తి గీతం!
Eluru Ganganamma Anthem | 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఏలూరు గ్రామ దేవత శ్రీ గంగానమ్మ తల్లి వైభవాన్ని కళ్లకు కట్టేలా రూపొందించిన ఏలూరు గంగానమ్మ ఆంథెమ్ యూట్యూబ్‌లో విజయవంతంగా దూసుకుపోతోంది.
Eluru Ganganamma Anthem | 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఏలూరు గ్రామ దేవత శ్రీ గంగానమ్మ తల్లి వైభవాన్ని కళ్లకు కట్టేలా రూపొందించిన ఏలూరు గంగానమ్మ ఆంథెమ్ యూట్యూబ్‌లో విజయవంతంగా దూసుకుపోతోంది. తరంగిణి ఒరిజినల్స్ యూట్యూబ్ ఛానెల్లో విడుదలైన ఈ భక్తి గీతానికి ప్రేక్షకుల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. సుమారు 150 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న ఏలూరు జాతరపై ఇప్పటివరకు ఒక్క ప్రత్యేక పాట కూడా లేకపోగా, తొలిసారిగా తరంగిణి ఒరిజినల్స్ మరియు గంగానమ్మ పిక్చర్స్ ఈ ప్రతిష్టాత్మక సాంగ్‌ను రూపొందించి సరికొత్త రికార్డు సృష్టించాయి.
ఈ గీతాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ఘనంగా ఆవిష్కరించారు. సత్యవతి మోటేపల్లి, దారపు ఛాయాదేవి నిర్మాతలుగా వ్యవహరించగా, మల్లిక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సాయి తేజ మోటేపల్లి దర్శకత్వం వహించిన ఈ వీడియోలో వంశీ మోటేపల్లి ప్రధాన పాత్రలో నటించగా, ప్రముఖ గాయకుడు ధనుంజయ్ సీపాన తన పవర్ఫుల్ గాత్రంతో పాటను అద్భుతంగా ఆలపించారు. సత్య కశ్యప్ సంగీతం, యువ కిరణ్ సాహిత్యం భక్తులలో ప్రత్యేక అనుభూతిని కలిగిస్తున్నాయి. ఈ గీతంలో మేకల కల్యాణ్ నాయుడు, నవ్య, గంగ, చైల్డ్ ఆర్టిస్ట్ దేవాన్షి తదితరులు నటించగా, శ్రీయ బెందాడి గంగానమ్మ తల్లి పాత్రలో ఒదిగిపోయి అలరించారు. మేకల నాగేంద్ర ఎడిటర్‌గా, నాగి రెడ్డి అసోసియేట్ డైరెక్టర్‌గా, డాన్స్ మాస్టర్ సాగర్ వేలూరు కొరియోగ్రఫీ అందించగా, లోయ సాయి, మాగంటి ఏడుకొండలు, తుంగ జయంత్ ఆర్ట్ డిపార్ట్మెంట్గా సహకరించారు. ఏలూరు సంస్కృతిని ప్రతిబింబించే ఈ పూర్తి వీడియో సాంగ్‌ను భక్తులు తరంగిణి ఒరిజినల్స్ యూట్యూబ్ ఛానెల్లో వీక్షించవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eluru Ganganamma | ఏలూరు గంగానమ్మ ఆంథెమ్.. యూట్యూబ్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న భక్తి గీతం!
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

