డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
పోరాటాలతో గతంలో సీపీఎం అనేక ప్రాజెక్ట్ లు సాధించిందని మాజీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
నల్లగొండ : సాగునిటీ ప్రాజెక్టులను పాలకులు పట్టించుకోవడం లేదు. దీనిపై సీపీఎం అనేక పోరాటాలు చేస్తునే ఉన్నది. పోరాటాలతో గతంలో సీపీఎం అనేక ప్రాజెక్ట్ లు సాధించిందని మాజీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం రిజర్వాయర్ వద్ద మూడు రోజుల పాటు సాగే సీపీఎం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఫ్లోరైడ్ పీడీత మునుగోడు ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించాలని దీర్ఘకాలిక డిమాండ్ ఉన్నది. అందుకు డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ నే ఏకైక మార్గం అన్నారు.
2007 లో రాజశేఖర్ రెడ్డి దీనిపై ఒక ప్రపోసల్ రెడీ చేశారు. కానీ ముందుకు పడలేదు. 2015 జూన్ లో కేసీఆర్ డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను మంజూరు చేశారన్నారు. దీనిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఎదుళ్ల నుంచి డిండికి నీళ్లు వద్దు అంటూ మహబూబ్ నగర్ నేతలు కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇది సరికాదన్నారు. అవసరమైన నిధులు ఇచ్చి డిండి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా శివన్నగూడెం నుంచి రాచకొండ ఎత్తిపోతల పథకన్ని మంజూరు చేసి నిధులు కేటాయించాలి. దీని కోసమే ఇవ్వాళ సీపీఎం పాదయాత్ర చేస్తుందన్నారు. ఆయన వెంట ల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, యాదాద్రి జిల్లా కార్యదర్శి ఏండీ జహంగీర్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

