ప్రొటోకాల్ పాటించేలా ఆదేశించండి
ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్దేశ పూర్వకంగా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, ప్రొటోకాల్ పాటించేలా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్‌ను ఆమె కలిసి పలు సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు.
- ధాన్యం సేకరణలో ఇబ్బందులు తొలిగించండి
- నర్సాపూర్ నియోజవకర్గంలో సమస్యలు పరిష్కరించండి
- మెదక్ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసిన సునీతాలక్ష్మారెడ్డి
మెదక్, మే 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్దేశ పూర్వకంగా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, ప్రొటోకాల్ పాటించేలా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్‌ను ఆమె కలిసి పలు సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల నర్సాపూర్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి వివేక్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల తరహాలో మాట్లాడడం, కాంగ్రెస్ శ్రేణులు అత్యుత్సా హం చేయడంతో తాము కార్యక్రమాన్ని అడ్డుకున్నట్లు తెలిపారు. అభివృద్ధ్ది, సంక్షేమం విషయంలో సహకారం అందిస్తామన్నారు.
ఇటీవల హ త్నూర మండలంలో ఇండ్ల పట్టాలు పంపిణీ ఉందని అధికారులు తెలిపితే తాను వెళ్లానని, తీరా అక్కడికి వెళ్లిన తర్వాత కార్యక్రమం రద్దు చేశామని తెలపడం సరికాదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ పాటించరంటే తాము కార్యక్రమాలకు దూరం గా ఉంటామని కలెక్టర్‌కు తెలిపారు. వడ్లు వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, లారీలు, హమాలీల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. కొనుగోలు కేం ద్రాల్లో తరుగు తీస్తున్నారని, లారీలు అందుబాటులో లేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే తెచ్చారు. నర్సాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు సునీతాలక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
POCSO case | ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
Pre Diabetes | ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి.. ఈ దశ నుంచి ఎలా బయట పడాలి.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Disha Patani | సైకిల్ పక్కన దిశా పటానీ అందాల పోజులు.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
Madhavaram krishna Rao | ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు.. నిరాహార దీక్షలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
TTD | టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

