సిటీలో విదేశీ ఓట్లు
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలో జరుగుతున్న సర్ ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. బోగస్ , డూప్లికేట్ , రిపీటెడ్, అనామలస్ ఓట్లను ఏరివేసేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమంతో ట్రై కార్పొరేషన్లలోవిస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
- సనత్నగర్లో నేపాలీలు.. రంగారెడ్డిలో రోహింగ్యాలు
సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తె లంగాణ) : ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలో జరుగుతున్న సర్ ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. బోగస్ , డూప్లికేట్ , రిపీటెడ్, అనామలస్ ఓట్లను ఏరివేసేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమంతో ట్రై కార్పొరేషన్లలోవిస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. బీఎల్వోలు లోతుగా విచారణ జరుపుతున్న కొద్దీ విదేశీయులకు కూడా అక్రమంగా ఓటు హకు దకిన తీరు బయటపడుతోంది.
ఏకంగా విదేశీయులు నగరంలో తిష్టవేసి అక్రమంగా ఓటు హకు పొందినట్లు అధికారులు గుర్తించడం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 12.53 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ కాగా, అత్యధిక నోటీసులకు సంబంధించి విచారణ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇప్పటికే తెలిపారు. అయితే నెలలు గడుస్తున్నా దాదాపు 5 నుంచి 6 వేల నోటీసులకు ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు రంగంలోకి దిగి లోతుగా శోధించగా సనత్నగర్ నియోజకవర్గంలో ఒకే పోలింగ్ బూత్ లో 12 మంది నేపాలీలు అక్రమంగా ఓటు హకు పొందినట్లు తేలింది.
వీరిని విచారించగా భారత్ లోకి వచ్చేందుకు వీసా అవసరం లేదు కాబట్టి సక్రమంగానే వచ్చామని చెప్పుకొచ్చారు. కానీ భారతీయ పౌరసత్వానికి సంబంధించి ఎలా ంటి ఆధారాలు చూపలేకపోయారు. వారి వద్ద ఉన్నవన్నీ నేపాల్ పత్రాలే కావడంతో అధికారులు షాకయ్యారు. ఇదే తరహాలో రంగారెడ్డి జిల్లాలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో కొందరు రోహింగ్యాలు కూడా ఓటర్లుగా నమోదైనట్లు గుర్తించారు.పౌరసత్వ ఆధారాలు లేకపోవడంతో వీరిని విదేశీయులుగా పరిగణించి ఓటు హకును రద్దు చేసేందుకు యం త్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది.
కాగా వారు ఓటరు జా బితాలో ఉన్నారా.. లేరా అని అ ధికారుల పరిశీలనలో తేలాల్సి ఉంది. కాగా నోటీసులు జారీ చేసిన వారిలో మెజారిటీ ఓటర్ల విచారణ పూర్తయింది. అయితే 5 వేల నుంచి 6 వేల మందికి పైగా ఓటర్లు నోటీసులు అందుకుని నెలలు గడుస్తున్నా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో విద్య, ఉద్యోగం, వ్యాపారాల కోసం వచ్చి స్థిరపడిన వారు సుమారు 30 నుంచి 40 శాతం వరకు ఉంటారని, వీరికి తమ సొంత ఊళ్లలో కూడా ఓట్లు ఉండటంతో ఇకడ వివరాలు అందించడానికి ఆసక్తి చూపడం లేదని స్పష్టమవుతోంది.
కాగా, సర్ ప్రక్రియలో కావాలని ఓట్లను తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా ఎన్నికల అధికారులు తీవ్రంగా ఖండించారు. ఓటు హకు మూలాలను ధ్రువీకరించుకోవడానికే నోటీసులు ఇచ్చామని, ఆధారాలు సమర్పించిన వారి పేర్లు తుది జాబితాలో భద్రంగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. బోగస్ ఓట్ల ఏరివేతపై ప్రజాప్రతినిధులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని, అనవసర ఓట్లు తగ్గడం వల్ల ఎన్నికల వ్యయం తగ్గుతుందనే ఉద్దేశంతోనే ఎవరూ ఫిర్యాదులు చేయ డం లేదని వివరించారు. ఈ సమగ్ర విచారణ ప్రక్రియ త్వరలోనే ముగియనుండగా, ఈ నెల 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం తుది కసరత్తు చేస్తోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

