మన పొలాలకు గోదావరి మళ్లాలి అదే మల్లావఝలకు నిజమైన నివాళి : కేటీఆర్
నదుల్లో పుషలంగా నీరున్నా ప్రభుత్వం ఎత్తిపోయకపోవడంతో తెలంగాణలో రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
- ప్రకృతి తెచ్చిన కరువు కాదిది.. పాలకుల వికృతి తెచ్చిన కరువు
- కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులపై సర్కార్ నిర్లక్ష్యం
- గోదావరి, కృష్ణా నదుల నుంచి 1,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినయ్
- నీళ్లెత్తకుండా పొలాలు ఎండబెట్టిండ్రు
- సదాశివుడు స్మారక పురసార ప్రదానోత్సవంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ జలసాధన ఉద్యమ సమయంలో మల్లావఝల సదాశివుడు రాసిన ‘తలాపున పారుతుంది గోదారి.. మన సేను మన సెలక ఎడారి’ అనే గీతం ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించింది. మహాకవి దాశరథి చెప్పిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే మాటకు ఎంతటి శక్తి ఉన్నదో.. సదాశివుడి గీతానికీ అంతటి భావోద్వేగ బలం ఉన్నది. అప్పట్లో తెలంగాణ జలవనరుల దుస్థితిని తన పాటలో అద్భుతంగా ఆవిషరించిన మల్లావఝల మాటలు నేటి పరిస్థితులకు కూడా అద్దం పడుతున్నయ్.
-కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : నదుల్లో పుషలంగా నీరున్నా ప్రభుత్వం ఎత్తిపోయకపోవడంతో తెలంగాణలో రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత కరువు ప్రకృతి సృష్టించింది కాదని, పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ కక్ష సాధింపు చర్యల ఫలితంగా వచ్చిందని విమర్శించారు. కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి, కృష్ణా నదుల్లోని నీటిని సమర్థంగా వినియోగించి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. గోదావరి జలాలను తెలంగాణలోని ప్రతి పొలానికీ మళ్లించడమే ప్రజాకవి, గీత రచయిత మల్లావఝల సదాశివుడికి మనం అర్పించే నిజమైన నివాళులని స్పష్టంచేశారు.
హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడిటోరియంలో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ‘గోదావరి గొంతుక’ మల్లావఝల సదాశివుడు స్మారక పురసార ప్రదానోత్సవానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా 2024-25 సంవత్సరానికి చెమన్ సింగ్, 2025-26 సంవత్సరానికి సంగిశెట్టి శ్రీనివాస్‌కు స్మారక పురసారాలను అందజేశారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలందించిన తిరునగరి దేవకీదేవి, కవ్వంపల్లి స్వామిని ప్రత్యేకంగా సతరించారు.
కష్టజీవి పక్షాన నిలిచేవాడే నిజమైన కవి
మల్లావఝల సదాశివుడు సాహిత్య సేవలను గుర్తుచేసుకుంటూ కేటీఆర్ భావోద్వేగంగా మాట్లాడారు. సమాజంలోని సమస్యలను కవి ముందుగానే గుర్తిస్తాడని, కష్టజీవికి ఇరువైపులా నిలబడేవాడే నిజమైన కవి అని చెప్పారు. పేదల కన్నీటి చుకలను కవితలతో కత్తులుగా మార్చిన అద్భుతమైన ప్రజాకవి సదాశివుడని కొనియాడారు. ఆయనను అజ్ఞాత సూర్యుడిగా అభివర్ణిస్తూ, నిస్వార్థంగా, నిరాడంబరంగా జీవించిన గొప్ప వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ జలసాధన ఉద్యమ సమయంలో సదాశివుడు రాసిన ‘తలాపున పారుతుంది గోదారి.. మన సేను మన సెలక ఎడారి’ అనే గీతం ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిందని వివరించారు. అప్పట్లో తెలంగాణ జలవనరుల దుస్థితిని తన పాటలో అద్భుతంగా ఆవిషరించిన సదాశివుడి మాటలు నేటి పరిస్థితులకు కూడా అద్దం పడుతున్నాయని చెప్పారు. తలాపున గోదావరి పారుతున్నా మన చేను, చెలకలు ఎడారిగా మారడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. గోదావరిఖని ప్రాంతపు మట్టిలోనే ఏదో ప్రత్యేక శక్తి ఉన్నదని, అందుకే అకడి నుంచి కవిత్వం వరదలా పొంగిందని వ్యాఖ్యానించారు. అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం తనపై చూపిన ప్రభావాన్ని ప్రస్తావించారు. ఇటీవల కేసీఆర్ పాత్రతో శ్రీకాంత్ ఓదెల సినిమాను రూపొందించి గోదావరిఖని ప్రాంత సత్తాను చాటారని కొనియాడారు.
ఉద్యమ జ్వాలలు నిరంతరం ప్రజ్వరిల్లాలి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని చూడకుండానే మల్లావఝల సదాశివుడు తుదిశ్వాస విడువడం తీరని లోటని కేటీఆర్ విచారం వ్యక్తంచేశారు. సదాశివుడి వంటి ప్రజాకవులకు, తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు అందించే నిజమైన నివాళి గోదావరి జలాలను రాష్ట్రంలోని ప్రతి పొలానికీ చేర్చడమేనని స్పష్టంచేశారు. పాలకులు దారితప్పి వ్యవహరించకుండా ప్రజల తరఫున ప్రశ్నించే శక్తి నిరంతరం ఉండాలని, అందుకోసం ఉద్యమ జ్వాలలు ఎప్పటికీ ప్రజ్వరిల్లుతూనే ఉండాలని చెప్పారు. రైతుల హకుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సజీవంగా ఉంచుతూ, రాష్ట్ర జలవనరులు అన్నదాతల ప్రయోజనాలకు ఉపయోగపడేలా చూడటమే తమ ఆకాంక్ష అని పేరొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నిరంతరం కొనసాగాలని, పాలకులను ప్రజల పక్షాన నిలదీసే చైతన్యం సజీవంగా ఉండాలని పిలుపునిచ్చారు.
వెయ్యి టీఎంసీల నీరు సముద్రం పాలు
ఈ ఏడాది గోదావరి నది నుంచి సుమారు 750 టీఎంసీలు, కృష్ణా నది నుంచి 258 టీఎంసీల నీరు వచ్చిందని, మొత్తంగా దాదాపు వెయ్యి టీఎంసీల జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోయాయని కేటీఆర్ వివరించారు. నదుల్లో విస్తారంగా నీటి ప్రవాహం ఉన్నా ప్రభుత్వం వాటిని సమర్థంగా వినియోగించలేకపోయిందని విమర్శించారు. నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని తాము పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. నీళ్లు కండ్లముందే సముద్రంలోకి పోతుంటే పొలాలను ఎండబెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. ఇదేదో రాజకీయ అకసుతోనో, కోపంతోనో చెప్తున్న మాట కాదని, కండ్లముందు కనిపిస్తున్న వాస్తవాలను ఆధారాలతో వివరిస్తున్నానని చెప్పారు. ఈ ఏడాది వర్షాలు, నీటి లభ్యత ఉన్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతులు సంక్షోభాన్ని ఎదురొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కేసీఆర్‌పై కక్షతోనే ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు కేసీఆర్ హయాంలో నిర్మించినవనే కారణంతోనే కాంగ్రెస్ పాలకులు వాటిని వినియోగించడం లేదని కేటీఆర్ విమర్శించారు. ప్రాజెక్టుల్లో పంపుల స్విచ్ ఆన్ చేస్తే నీళ్లు పైకి వచ్చి పొలాలకు చేరుతాయని, కానీ ఆ పని చేసేందుకు కూడా పాలకులు సిద్ధపడటం లేదని వాపోయారు. బీఆర్ఎస్ నాయకత్వమంతా కలిసి కన్నెపల్లి వరకు వెళ్లి లక్ష క్యూసెకుల నీరు వృథాగా పోతున్న తీరును చూపించినా ప్రభుత్వంలో స్పందన లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ పగలు, ప్రతీకారాలు తర్వాత చూసుకోవచ్చని, ముందుగా రైతులను ఆదుకోవాలని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, కవి వనపట్ల సుబ్బయ్య, విరాహత్ అలీ, సదాశివుడు కుమారులు విజయానంద్, వంశీ, కుమార్తె కృష్ణవేణి, రచయితలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.
కేసీఆర్ పాటలు ఉద్యమానికి స్ఫూర్తి
తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం, కవిత్వం, పాటలు ప్రజలకు ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని అందించాయని కేటీఆర్ గుర్తుచేశారు. 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో రాష్ట్ర సాధన సాధ్యమవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమైనప్పుడు కేసీఆర్ స్వయంగా పాటలు రాసి ప్రజల్లో నమ్మకాన్ని, స్ఫూర్తిని నింపారని గుర్తుచేశారు. ‘సిపాయిల తిరుగుబాటు విఫలమైందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం? రాజీలేని పోరాటమే విజయాన్ని అందిస్తుంది. ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది’ అనే భావంతో కేసీఆర్ రాసిన పాటలు ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపాయని వివరించారు. 72 ఏండ్ల వయసులోనూ కేసీఆర్‌కు వందలాది పద్యాలు, కవితలు నదీ ప్రవాహంలా, ధారలా గుర్తుకు వస్తాయని ఆయన సాహిత్యాభిరుచిని ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం దిశానిర్దేశం చేసిందని, కవులు, రచయితలు తమ కలంతో ఉద్యమానికి అక్షరబలాన్ని అందించారని గుర్తుచేశారు.
సిరాచుక్కల్లోంచి కాంతి ఖడ్గాలు : దేశపతి
సిరాచుక్కల్లోంచి కాంతి ఖడ్గాలను మొలిపించిన కవి మల్లావఝల సదాశివుడు అని తెలంగాణ వికాస సమితి గౌరవాధ్యక్షుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. మల్లావఝల స్మారక పురస్కార ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడుతూ పుట్టిన కులం పరిమితులు ఛేదించుకొని.. తన బీజాక్షరాలు కుమ్రం భీం అని ప్రకటించుకున్న మహోన్నత రచయిత సదాశివుడు అని కీర్తించారు. తెలంగాణ నేల మీద ఎగిసిపడిన అన్ని ఉద్యమాల్లో ఆయన మమేకమయ్యారని గుర్తుచేశారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడంతో ఆయన్ను హత్యచేయాలని చూశారని వివరించారు. స్త్రీవాద సాహిత్యం, దళిత ఉద్యమాలు మొదలవుతున్న కొత్తలోనే ‘ఎన్నాళ్లు ఈ వెలివేత.. ఎన్నాళ్లు ఈ వలపోత’ అని పాట రాశారని తెలిపారు. గోదావరిఖని ప్రజా సమస్యలపై అనేక పాటలు రాశారని గుర్తు చేశారు. ‘తలాపున పారుతోంది గోదారి.. మన చేను మన చెలుక ఏడారి’ లాంటి పాటలతో తెలంగాణలో జరుగుతున్న నీటి దోపిడిపై గళం విప్పారని పేర్కొన్నారు. కేసీఆర్ ఆ పాట విని జల సాధన అనే క్యాసెట్టు తెస్తే అందులో రికార్డు చేయించారని గుర్తుచేశారు. కేసీఆర్ సదాశివుడికి ఫోన్ చేసి చాలా గొప్ప పాట రాశారని, తెలంగాణ భవన్ బాధ్యతలు చూసుకోవాలని కోరినట్టు వెల్లడించారు.
మనసుకు హత్తుకున్న పాట : గోరటి వెంకన్న
మల్లావఝల సదాశివుడు రాసిన ‘తలాపున గోదారి..’ పాట తన మనసును హత్తుకున్నదని ప్రముఖ గాయకుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తెలిపారు. ‘రైతు బతుకు అమాస.. ఆంధ్ర బాబు చేస్తుండు తమాషా’లాంటి చిన్న వాక్యాలతో ఎంతో ప్రభావం చూపిన గొప్ప గీత రచయిత సదాశివుడు అని ప్రశంసించారు. నీళ్ల దోపిడీపై అనేక మంది కవులు రాశారని.. మల్లావఝుల రాసిన పాట మాత్రం చిరస్థాయిలో నిలిచిపోతుందని చెప్పారు.
ఐటీని ఉత్కృష్టంగా నిలిపిన ఘనత కేటీఆర్‌దే : దేవకీదేవీ
ప్రపంచంలోనే ఐటీ రంగంలో తెలంగాణను ఉత్కృష్టంగా నిలబెట్టిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందని రచయిత్రి తిరునగరి దేవకీదేవీ ప్రశంసించారు. తాను లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు ఉమ్మడి ఏపీలో స్పాట్ వాల్యుయేషన్ హైదరాబాద్ కేంద్రంగా జరిగేదని, ఏపీ వాళ్లంతా మన భాషను విమర్శిస్తే తాను సహించలేదని గుర్తుచేశారు. తెలంగాణ కోసం జరిగిన అన్ని రకాల ఉద్యమాల్లో పాల్గొన్నట్టు వివరించారు. జనసభ, తెలంగాణ ఉత్సవ కమిటీ, తెలంగాణ మహిళా ఐక్య వేదిక నుంచి సాగరహారం, మానవహారంలో పాల్గొన్నట్టు తెలిపారు.
సాహిత్యంపై పట్టుతోనే దీటైన ప్రసంగాలు : చమన్ సింగ్
రాజకీయ నాయకులకు కేవలం రాజకీయాలు తెలిస్తే చాలదని, సాహిత్యం, కళలు, పదబంధాలు తెలిస్తేనే దీటైన ప్రసంగాలు ఇవ్వగలుగుతారని ప్రముఖ కవి, కథా రచయిత చమన్ సింగ్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆ స్పృహ ఉండటం వల్లే అనర్గళంగా మాట్లాగలుగుతారని పేర్కొన్నారు. కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉన్నదని చెప్పారు.
కేటీఆర్ పిలుపుతోనే చేనేత దుస్తులు : సంగిశెట్టి శ్రీనివాస్
2016లో పుస్తకావిష్కరణ సందర్భంగా కేటీఆర్ పిలుపుతో నాటి నుంచి చేనేత దుస్తులు ధరిస్తున్నట్టు ప్రముఖ సాహిత్య విమర్శకుడు సంగిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. కేసీఆర్‌కు బహుభాషా పాండిత్యం ఉన్నట్టుగానే.. కేటీఆర్‌కు సైతం తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌పై పట్టు ఉన్నదని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పా టులో వీరి పాత్ర కీలకమైందని గుర్తుచేశారు.
ప్రజల పాటగా నిలిచేందుకు స్ఫూర్తి : కవ్వంపల్లి స్వామి
మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కార ప్రదానోత్సవంలో ప్రత్యేక సత్కారం పేరిట సన్మానించడం ప్రజల పాటగా నిలిచేందుకు మరింత స్ఫూర్తి నింపిందని ప్రజాగాయకుడు కవ్వంపల్లి స్వామి పేర్కొన్నారు. సదాశివుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

