Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Road accident | ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలో పడటంతో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో 17 మందికి గాయాలయ్యాయి. రాజస్థాన్ (Rajasthan) లోని కోటా (Kota) సమీపంలో శనివారం తెల్లవారుజామున ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్ వే (Delhi-Mumbai Express Way) పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Road accident : ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలో పడటంతో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో 17 మందికి గాయాలయ్యాయి. రాజస్థాన్ (Rajasthan) లోని కోటా (Kota) సమీపంలో శనివారం తెల్లవారుజామున ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్ వే (Delhi-Mumbai Express Way) పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 27 మంది ప్రయాణిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ నుంచి రాజస్థాన్లోని ఖాటూ శ్యామ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తువల్లే బస్సు అదుపు తప్పిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. రోడ్డు పక్కన ఉన్న రక్షణ కంచెను ఢీకొట్టి మరీ బస్సు లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో మరణించిన ఎనిమిది మందిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన 17 మందిని కోటాలోని ఎంబీఎస్ ఆసుపత్రి, న్యూ మెడికల్ కాలేజీ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో అందరి పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
ప్రమాద గురించిన సమాచారం తమకు ఉదయం 8 గంటల సమయంలో అందిందని పోలీసులు చెప్పారు. కోటా జిల్లా కలెక్టర్ పీయూష్ సమారియా, ఐజీ హరేంద్ర మహావర్ ఎంబీఎస్ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

