
వెంగళరావునగర్,డిసెంబర్1: మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నానని వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ అన్నారు. బుధవారం వెంగళరావునగర్ కాలనీ అసోసియేషన్నాయకులు, సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలనీలో రహదారులు, మంచినీరు, మురుగునీరు, విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సహకారంతో కాలనీలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.