ఎండాకాలం వచ్చిందంటే చాలు.. వంటగదినంతా చీమలు ఆక్రమిస్తాయి. చకెర డబ్బాలోకి, ఆహార పదార్థాల్లోకి, మరికొన్నిసార్లు భోజనం చేసే పళ్లెం మీదకు కూడా ఎగబడతాయి. చాలామంది చీమలను వదిలించుకోవడానికి తరచుగా మారెట్లో లభించే రసాయన స్ప్రేలు, పౌడర్లను ఆశ్రయిస్తారు. అయితే ఇవి చిన్న పిల్లలకు, జంతువులకు ప్రమాదకరంగా ఉంటాయి. అందువల్ల విషపూరిత రసాయనాలు లేకుండా చీమలను దూరంగా ఉంచగల ఇంటి చిటాల కోసం చాలామంది వెతుకుతారు. కొన్ని సాధారణ టిప్స్ ఎర్ర చీమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి.
ఎర్ర చీమలను వదిలించుకోవడానికి తెల్ల వెనిగర్ అత్యంత సులభమైన మార్గాలలో ఒకటి. చీమలు కదులుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన వాసనను వెదజల్లుతాయి. వెనిగర్ ఈ వాసనను ఆపేసి, వాటి దారిని విచ్ఛిన్నం చేస్తుంది. ఇలా చేయడానికి ఒక స్ప్రే బాటిల్లో సగం నీరు, సగం తెల్ల వెనిగర్ కలిపి, చీమలు ఎకువగా కనిపించే ప్రదేశాలలో స్ప్రే చేయండి. దీనిని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించండి. మరో ఉపాయమేమంటే… పుదీనా ఘాటైన వాసనకు చీమలు దూరంగా ఉంటాయి. అందువల్ల అవి కనిపించే ప్రదేశాలలో పుదీనా ఆకులను ఉంచితే చాలు అవి ఆ ప్రదేశంలో తిరిగి అడుగుపెట్టలేవు. నిమ్మకాయ, పులుపు వాసన కూడా చీమలను తరిమికొట్టడానికి సహాయపడుతుంది.
చీమలు కనిపించే ప్రదేశాలలో నిమ్మరసం చల్లడం, ప్రత్యామ్నాయంగా నిమ్మ తొకలను చిన్న ముకలుగా కోసి వంటగది మూలలో ఉంచడం వల్ల చీమలను అరికట్టగలుగుతాం. దాల్చినచెక వాసన మనుషులను ఆకర్షించినప్పటికీ, చీమలు దానికి దూరంగా ఉంటాయి. దాని ఘాటైన వాసన చీమలను తమ దారి మార్చుకునేలా చేస్తుంది. చీమల దారుల చుట్టూ దాల్చినచెక పొడిని చల్లడం కానీ, దాల్చినచెక నూనెలో నానబెట్టిన దూది ఉండలను చీమలు తరచుగా వచ్చే ప్రదేశాలలో ఉంచినా ఫలితం కనిపిస్తుంది. వీటన్నిటి కంటే మరింత సులువైన మార్గం.. ఉప్పులో నాలుగు చుక్కల నీళ్లు వేసి.. దానిని చీమల దారులలో ఉంచడం. కొందరు ఉప్పుతో కలిపిన బేకింగ్ సోడాను కూడా ఉపయోగిస్తారు.