రైతు బాంధవులను రాచి రంపానను
పెట్టవద్దు యెపుడు పెద్దముప్పు!
దాపురించి మిమ్ము దావాలమున ముంచు
రైతు కంట నీరు రాని కెపుడు..!!
రైతు పంటలన్ని రమ్యమై యున్నవి
రోడ్ల మీద తడిసి రోదనంబు
హాలికులకు కంట హానపు బాధలు
తీరు మార్చు కొనియు తీసుకొండి..!
రైతు అరక దున్న రంజిల్లు పంటలు
పంటలన్ని పండ పారవశము
మంచి ధరలతో మన్నించి కొనినను
దేశ ప్రగతి వెలుగు దివ్యము గను..!
రోడ్ల మీద నిద్ర రోకలి పోటుయే
వాహనంబులన్ని వారిపైన
తిప్పి జంపి రిలను తీండ్రము తోడుత
మానవతకు గల్గె మచ్చ చూడ…!
హాలికులను జంప నపకీర్తి వచ్చెను
తగ్గె కేంద్ర ప్రభుత తప్పు నెరిగి
ఉద్య మంబు నాపి ఉట్టి చేతులు జూప
ప్రజల ఓట్లు లేక ప్రభుత మారు..!!
డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచారి
85558 99493