ఇహ లోకేహి ధనినాం.. పరోపి స్వజనాయతే
స్వజనోపి దరిద్రాణాం.. సర్వదా దుర్జనాయతే
ఈ లోకంలో సామాన్యంగా తన వాడు కాక పోయినా ధనికుడైనప్పు డు అతన్ని ఆత్మీయునిగా భావించి అందరూ ఆదరిస్తారు. ఒక వేళ పేదవాడు తన వాడైనప్పటికినీ దుర్జనుని దూరముంచినట్లు అతనిని దూరం పెడతారు! ధనిక, పేద భేదం లేకుండా మనిషిని ఆదరించటమే మానవత్వం, మానవ ధర్మం.
టి.సుధాకరశర్మ