కరోనా మ్యుటేషన్ చెంది
ఒమైక్రాన్ రూపం ఎత్తుకొని
మృత్యు శాసనం లిఖిస్తుందని
ఉన్నపళంగా ఊపిరి తీస్తుందని
అస్తిత్వం ప్రశ్నార్థకం చేస్తుందనీ..
ఇప్పుడు దిగులు చెందితే ఎలా?
అయినా మనమెప్పుడు
అప్రమత్తత హత్తుకున్నాం
అలసత్వం నెత్తికెత్తుకుని
యథేచ్ఛగా సంచరిస్తున్నాం
సామాజిక దూరాల దూరం చేసి
సమూహంగా సందడి చేస్తున్నాం
కరోనా కట్టడి చర్యలు కట్టిపెట్టి
మృత్యువును స్వాగతిస్తున్నాం
ఇపుడు…
కరోనా ముప్పు తప్పాలంటే
ముసుగు అత్యంత ఆవశ్యం
మిత్రమా! మాస్క్ అంటే
అడ్డు తెర మాత్రమే కాదు
శ్వాసకు ఆయువు మంత్రం
బతుకు రక్షణాత్మక కవచం
ఆరోగ్యానికి అమృత కలశం
భవితవ్యానికి భరోసా హస్తం
సామాజిక భద్రతకు బ్రహ్మాస్త్రం
కరోనా పాలిట పాశుపతాస్త్రం
అందుకే ఇప్పటికైనా…
ప్రాణం విలువ తెలుసుకొని
నియమాల ఆచరణతో పాటు
మాస్క్ దివ్యాస్త్రం ప్రయోగించి
ఒమైక్రాన్ భూతాన్ని జయిద్దాం
స్వస్థత భారతాన్ని ప్రతిష్ఠిద్దాం..!
కోడిగూటి తిరుపతి
9573929493