ఓటరు జాబితాలో పేరు లేదా?
తుది ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. నిరుడు ఆగస్టు 17న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో ఏఎస్‌డీడీ క్యాటగిరీ కింద పేర్లు తొలగించబడినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు.
- 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి
- అర్హులకు ఎన్నికల సంఘం మరో చాన్స్
- ఏఎస్‌డీడీ జాబితాలో ఉన్నవారికీ అవకాశం
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తుది ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. నిరుడు ఆగస్టు 17న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో ఏఎస్‌డీడీ క్యాటగిరీ కింద పేర్లు తొలగించబడినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. గైర్హాజరు (ఆబ్సెంట్), నివాసం మారినవారు (షిఫ్టెడ్), మరణించినవారు (డెడ్), డూప్లికేట్ ఓటర్లు (డూబ్లికేట్) అనే కారణాలతో ముసాయిదా జాబితాలో ఏఎస్డీడీగా గుర్తించి పేర్లు చేర్చనివారితోపాటు అర్హత ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేనివారు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి సందేహాలు, సహాయం అవసరమైనవారు తమ ప్రాంత బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో)ను సంప్రదించాలని సూచించారు. ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు. తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి ఈ నెల 26 వరకు క్లెయిమ్స్, ఆబ్జెక్షన్లపై విచారణ కొనసాగుతున్నది. ఈ నెల 30న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

