దూదిమెట్ల అక్రమ అరెస్ట్
బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్‌ను సిట్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్లో యాదవ్ పేరు లేకపోయినా, అతడిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు అత్యుత్సాహంతో అదుపులోకి తీసుకున్నారు.
- బీఆర్ఎస్ నేత బాలరాజుపై సర్కార్ దౌర్జన్యం
- కేటీఆర్‌పై వ్యాఖ్యలను ఖండించినందుకు చర్య
- ఫిర్యాదులో, ఎఫ్ఐఆర్లో పేరు లేకున్నా అదుపులోకి
- పోలీసుల అత్యుత్సాహంపై బీఆర్ఎస్ ఆగ్రహం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్‌ను సిట్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్లో యాదవ్ పేరు లేకపోయినా, అతడిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు అత్యుత్సాహంతో అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బాలరాజు యాదవ్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ నేపథ్యంలో బల్మూరి వెంకట్ భార్య ఇందుజారెడ్డి.. ఎవరో తన భర్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఎక్కడా బాలరాజ్ యా దవ్ పేరు లేదు. ఆ ఫిర్యాదుపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సైతం యాదవ్ పేరు లేదు. అయినప్పటికీ శుక్రవారం మధ్యాహ్నం 12.30గంటల సమయంలో హైదరాబాద్ సిట్ పోలీసులు నాగోల్‌లోని యాదవ్ ఇంటికి వచ్చి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యాదవ్‌ను నేరుగా స్టేషన్‌కు తీసుకెళ్లకుండా నగరమంతా తిప్పుతూ ఆయన కుటుంబసభ్యులను భయాందోళనకు గురిచేశారు. సాయంత్రానికి బషీర్‌బాగ్‌లోని సిట్ ఆఫీస్‌కు తీసుకువచ్చి విచారణ పేరుతో కాలయాపన చేసి, రాత్రి 10గంటలకు వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు పంపారు. రాత్రి 11 తరువాత న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు.
అట్రాసిటీ వర్తించదు: న్యాయవాది లక్ష్మణ్
బాలరాజ్ యాదవ్‌పై నమోదు చేసిన 356(2), 352, 79 బీఎన్ఎస్, 3(1)(ఆర్) ఎస్సీ, ఎస్టీ పీవోఏ యాక్ట్ తదితర సెక్షన్లన్నీ ఏడేండ్ల లోపు శిక్ష పడేవేనని ప్రముఖ న్యాయవాది లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ సెక్షన్లు ఉన్నప్పుడు రిమాండ్ చేయడానికి వీలు లేదని తెలిపారు. ముందుగా నిందితుడికి 35(3) నోటీసు ఇవ్వాలని అన్నారు. అరెస్టు చేసే సమయంలో దీనిపై తాను అధికారులను ప్రశ్నించానని, అయినా అరెస్టు చేశారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

