జెరూసలెం: ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా తమ కాల్పుల్లో గాయపడ్డ పాలస్తీనా పౌరుడి పట్ల ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) అమానవీయంగా ప్రవర్తించాయి. అతడిని తమ జీపు బ్యానెట్‌కు కట్టేసి తీసుకెళ్లాయి. దీనిపై విమర్శలు చెలరేగడంతో ఎట్టకేలకు అతడిని రెడ్‌క్రాస్ దవాఖానకు అప్పగించాయి. తమ సైనికుల చర్య యుద్ధ ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఇజ్రాయెల్ ఆర్మీ సైతం అంగీకరించింది. ఇజ్రాయెల్ ఆర్మీ కథనం ప్రకారం.. శనివారం వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ నగరంలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ జరిగింది. ఈ సందర్భంగా ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఉగ్రవాద అనుమానితుడు ఒకరు గాయపడ్డారు. అతడిని ఇజ్రాయెల్ సైనికులు తమ జీపుకు కట్టేసి తీసుకెళ్లారు. దీనిపై నెటిజన్లు విమర్శలు గుప్పించడంతో విచారణ చేస్తామని ఆర్మీ ప్రకటించింది