తమిళనాడు మాజీ మంత్రులపై విజిలెన్స్ దాడులు
AIADMK former Ministers: అన్నాడీంఎకేకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు సీ విజయభాస్కర్, ఎ స్పీ వేలుమణి ఇండ్లపై ఇవాళ విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఇద్దరు మంత్రులకు చెందిన 30 ప్రదేశాల్లో ఆ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఇద్దరిపై వేర్వేరుగా అవినీతి కేసులు రిజిస్టరై ఉన్నాయి. పుడుకొట్టై జిల్లాలోని ఇలుపురులో ఉన్నమాజీ ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్ నివాసంలో ఇవాళ తనిఖీలు జరుగుతున్నాయి. జాతీయ మెడికల్ కమీషన్‌కు విరుద్ధంగా అక్రమరీతిలో వెల్స్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌కు 2020లో
చెన్నై: అన్నాడీంఎకేకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు సీ విజయభాస్కర్, ఎ స్పీ వేలుమణి ఇండ్లపై ఇవాళ విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఇద్దరు మంత్రులకు చెందిన 30 ప్రదేశాల్లో ఆ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఇద్దరిపై వేర్వేరుగా అవినీతి కేసులు రిజిస్టరై ఉన్నాయి. పుడుకొట్టై జిల్లాలోని ఇలుపురులో ఉన్నమాజీ ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్ నివాసంలో ఇవాళ తనిఖీలు జరుగుతున్నాయి. జాతీయ మెడికల్ కమీషన్‌కు విరుద్ధంగా అక్రమరీతిలో వెల్స్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌కు 2020లో అనుమతి ఇచ్చిన కేసులో విజిలెన్స్ సోదాలు జరుగుతున్నాయి. అనుమతి విషయంలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.చెన్నై, సేలమ్, మధురై, తేని, తిరువల్లూరు పట్టణాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనూ మంత్రి విజయభాస్కర్‌పై గత ఏడాది అక్టోబర్‌లో డీవీఏసీ సోదాలు చేసింది.
కోయంబత్తూరులోని మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఇంట్లోనూ ఇవాళ విజిలెన్స్ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో మాజీ మంత్రిగా చేశారాయన. వీధి దీపాల టెండర్ల విషయంలో మంత్రి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సన్నిహితులకు మాత్రమే ఆయన టెండర్లు ఇప్పించినట్లు విమర్శలు ఉన్నాయి. మాజీ మంత్రి వేలుమణి ఇంటిపై దాడులు చేయడం ఈ ఏడాదిలో ఇది మూడవసారి.
వేలుమణికి సంఘీభావం తెలిపేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇవాళ ఉదయం ఆయన ఇంటి ముందు ప్రదర్శన చేపట్టారు. ఏడు మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

