కలల సాకారం కోసం..
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. మహిళా సాధికారత ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘మీ కలలు నిజం కావాలంటే ముందుగా మీరు కలలు కనాలి’ అనే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మాటలతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
వ్యోయగామి కావాలనుకునే కల్పన అనే అమ్మాయి తన ఆశయాన్ని ఎలా నెరవేర్చుకుంది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, కలల సాకారం కోసం హీరో ఆమెకు తోడుగా నిలిచే సన్నివేశాలతో ట్రైలర్ ఆసాంతం స్ఫూర్తివంతంగా అనిపించింది. ఓ పల్లెటూరి అమ్మాయి తన కలల సాఫల్యం కోసం సాగించిన ప్రయాణం నేపథ్యంలో ట్రైలర్‌ను హృద్యంగా తీర్చిదిద్దారు. శృతిహాసన్, రుహానీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, రచన: గంగరాజు గుణ్ణం, దర్శకత్వం: పవన్ సాధినేని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

