గోవాలో తన డియరెస్ట్ బేబీ మెడలో మూడు ముళ్లూ వేస్తున్నట్టు బంగారానికి కలొస్తే?! బాయ్‌ఫ్రెండ్‌తో ఐఫిల్ టవర్ మీద లిప్కిస్లో మునిగిపోయినట్టు చిట్టికి స్వీట్డ్రీమ్ పడితే?!… నిద్రనుంచి లేవబుద్ధేయదు కదూ! ఇలాంటి మధుర స్వప్నాల కోసం తమ గదుల్లో రంగురంగుల అల్లికల డ్రీమ్ క్యాచర్లను వేలాడదీసుకుంటున్నది నేటి తరం.
ఆ పంచరంగుల స్వప్నాలను గదికే పరిమితం చేయకుండా.. తమ వెంట తీసుకెళ్లేందుకు వీలుగా.. డ్రీమ్ క్యాచర్ కీచెయిన్లను బ్యాగులకూ, హ్యాండ్ బ్యాగులకూ పెట్టుకుంటున్నారు ఆడపిల్లలు. అలా, కలల వెంట తాము పరుగులు పెట్టడం కాదు, కలల్నే తమ వెంట పరిగెత్తిస్తున్నారు!