Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Doodimetla Balaraj Yadav | మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. సిట్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.
Doodimetla Balaraj Yadav | బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. సిట్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బగా బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బాలరాజ్ యాదవ్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో బల్మూరి వెంకట్ భార్య ఇందుజారెడ్డి.. తన భర్తపై ఎవరో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదులో బాలరాజ్ యాదవ్ పేరు లేదని, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోనూ ఆయన పేరు ప్రస్తావించలేదని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
అయినప్పటికీ శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హైదరాబాద్ సిట్ పోలీసులు నాగోల్‌లోని బాలరాజ్ యాదవ్ నివాసానికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పారని, దీంతో ఆయన కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. సాయంత్రం బషీర్‌బాగ్‌లోని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ జరిపిన పోలీసులు.. రాత్రి 10 గంటల సమయంలో వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత రాత్రి 11 గంటల అనంతరం న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు.
ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లే: న్యాయవాది లక్ష్మణ్
బాలరాజ్ యాదవ్‌పై నమోదు చేసిన 356(2), 352, 79 బీఎన్ఎస్, 3(1)(ఆర్) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవేనని ప్రముఖ న్యాయవాది లక్ష్మణ్ తెలిపారు. ఇలాంటి సెక్షన్లు ఉన్నప్పుడు నిందితుడిని రిమాండ్ చేయడానికి వీల్లేదని, ముందుగా బీఎన్ఎస్ఎస్ 35(3) ప్రకారం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. అరెస్టు సమయంలో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

