Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ బడ్జెట్‌తో యుద్ధ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ బడ్జెట్‌తో యుద్ధ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ టైటిల్ మార్పు, పాట వివాదం, కథలో మార్పులు వంటి అంశాలపై అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ ప్రచారాలపై సల్మాన్ ఖాన్ స్పందించి కీలక విషయాలను వెల్లడించారు. దర్శకుడు అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే పేరుతో రూపొందించాలని భావించారు. అయితే కథలోని విస్తృతమైన భావోద్వేగాలను ప్రతిబింబించేలా చివరకు ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుండటంతో మొదటి నుంచి దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ మరోసారి గాయకుడిగా తన గొంతును వినిపించడం కూడా చర్చనీయాంశమైంది. దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత ఆయన మైక్ పట్టి ‘తేరి సెక్సీ బ్యూటీ’ అనే పాట పాడారు. అయితే సైనికుల త్యాగాలు, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధలను చూపించే సినిమాలో ఇలాంటి సాహిత్యంతో పాటను చేర్చడం ఎంతవరకు సమంజసమంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఈ పాటపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరోవైపు ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ప్రభుత్వ జోక్యం జరిగిందంటూ ప్రచారం సాగింది. చైనాకు వ్యతిరేకంగా ఉండే సన్నివేశాలను తొలగించాలని, సరిహద్దు ఘర్షణలకు సంబంధించిన అంశాల్లో మార్పులు చేయాలని చిత్రబృందంపై ఒత్తిడి వచ్చినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ ప్రచారాన్ని సల్మాన్ ఖాన్ ఖండించారు.
కథలో మార్పులు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి రాలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ జోక్యం ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. సినిమా కథను తమకు నచ్చిన విధంగా, అసలు ఉద్దేశానికి అనుగుణంగా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా వెనుక ఉన్న అసలు ఆలోచన గురించి సల్మాన్ ఖాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన తండ్రి, ప్రముఖ రచయిత సలీం ఖాన్ ఇచ్చిన మూల ఆలోచన ఆధారంగా ఈ కథను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ‘మాతృభూమి’ అంటే కేవలం యుద్ధాలు, తుపాకుల మోత, సరిహద్దు ఘర్షణలు మాత్రమే కాదని సల్మాన్ వివరించారు. యుద్ధభూమిలో దేశం కోసం పోరాడే సైనికులతో పాటు, వారి కోసం ఇళ్ల వద్ద ఎదురుచూసే కుటుంబాల భావోద్వేగాలు కూడా ఈ సినిమాలో ప్రధానంగా కనిపిస్తాయని చెప్పారు. ఈ చిత్రం ఏ ఒక్క దేశానికి లేదా వర్గానికి వ్యతిరేకంగా రూపొందించిన సినిమా కాదని స్పష్టం చేశారు. ఇరువైపులా ఉండే సైనికులు మనుషులేనని, వారి కుటుంబాలకు ఉండే బాధలు, ఆవేదనలు కూడా ఒకేలా ఉంటాయని పేర్కొన్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయే సైనికుల వెనుక ఎన్నో కుటుంబాల కన్నీళ్లు ఉంటాయని, ఆ మానవీయ కోణాన్ని ప్రేక్షకులకు చూపించడమే తమ ఉద్దేశమని వివరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

