Donald Trump | ఆ పని చేయకండి.. అతిపెద్ద ఉల్లంఘన అవుతుంది.. ఇజ్రాయెల్‌కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
Donald Trump | ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే రెండు దేశాలు చేసిన ప్రకటనలు మళ్లీ ఉద్రిక్తతలకు తెరలేపాయి. ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని, అందుకు ప్రతిగా తాము గట్టిగా బుద్ధిచెబుతామని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
Donald Trump : ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే రెండు దేశాలు చేసిన ప్రకటనలు మళ్లీ ఉద్రిక్తతలకు తెరలేపాయి. ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని, అందుకు ప్రతిగా తాము గట్టిగా బుద్ధిచెబుతామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దాంతో ఇజ్రాయెల్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని ఇరాన్ కౌంటర్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా స్పందించారు. ఇజ్రాయెల్ గట్టి హెచ్చరిక చేశారు. ‘ఇజ్రాయెల్. ఆ బాంబులను జారవిడువకండి. అది అతిపెద్ద ఉల్లంఘన అవుతుంది. మీ పైలెట్లను వెంటనే వెనక్కి తెచ్చుకోండి.’ అని తన పోస్టులో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ట్రంప్ ప్రతిపాదన మేరకు ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
కాల్పుల విరమణకు ఒప్పుకుంటున్నట్లు రెండు దేశాలు అధికారిక ప్రకటనలు కూడా చేశాయి. ఆ తర్వాత రెండు గంటలకే ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, అందుకు తాము గట్టిగా బుద్ధిచెబుతామని ఇజ్రాయెల్ వ్యాఖ్యానించింది. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ తిప్పికొట్టింది. ఇజ్రాయెల్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని, ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నామని వార్నింగ్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా స్పందించారు. ఇజ్రాయెల్ తొందరపడి బాంబులు వేయవద్దని హెచ్చరించారు. అయితే ట్రంప్ మాటపై ఇజ్రాయెల్ నిలబడుతుందా.. లేదంటే ఇరాన్‌పై బాంబులు వేసి మళ్లీ యుద్ధాన్ని రాజేస్తుందా అనేది వేచిచూడాలి.
Read More >>
భార్య హత్య కేసులో కమెండో.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే..!
గుజరాత్‌కు 21 బాంబు బెదిరింపులు.. కటకటాల వెనక్కి మహిళా ఇంజినీర్.. ఎందుకలా చేసిందో తెలిస్తే షాక్..!
ఇరాన్ మాట తప్పింది.. గట్టిగా బదులిస్తాం : ఇజ్రాయెల్
ముగిసిన ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత స్టాక్ మార్కెట్లలో జోష్
కాల్పుల విరమణ మాకు ఒకే.. థ్యాంక్యూ ట్రంప్ : నెతన్యాహు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

