లండన్, జూలై 5: ప్రస్తుతం మనం చూస్తున్న కుక్కలు ఒకప్పుడు తోడేళ్లు అని, కాలక్రమేణా కుక్కలుగా పరిణామం చెందాయని తాజా అధ్యయనంలో తేలింది. 15 వేల ఏండ్ల క్రితంనాటి మంచుయుగంలో లభించిన కొన్ని ఆనవాళ్లు, గడిచిన లక్ష ఏండ్లలో ఐరోపా, సైబీరియా, ఉత్తర అమెరికాలోని దాదాపు 72 పురాతన తోడేళ్ల డీఎన్ఏలను విశ్లేషించి
ఈ అంచనాకు వచ్చినట్టు యూకేలోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, దీన్ని పూర్తిస్థాయిలో ధ్రువీకరించడానికి మరికొన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరమున్నదన్నారు.