ఉన్నట్టుండి కొద్ది క్షణాలపాటు ఈ లోకమంతా చీకటి కమ్మేస్తే… ప్రాణం పోయినట్లు బాధపడతాం… కళ్లు నలుపుకుంటూ ఆ చీకటిని దాటి చూసే ప్రయత్నం చేస్తుంటాం.. మరి పుట్టుకతో లేదా ప్రమాదవశాత్తూ కళ్లు పోగొట్టుకున్న వాళ్ల పరిస్థితి ఏంటి? జీవితాంతం వాళ్ల బతుకంతా చీకటే కదా. మరి అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వస్తే.. మరణానంతరం మన కళ్లకు మరో జీవితం లభిస్తే అంతకన్నా ఆనందం మరొకటి ఉంటుందా.. అందుకే నేత్రదానం మహాభాగ్యం అని చెబుతున్నారు ప్రముఖ నేత్రవైద్యులు డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి. ఐ డొనేషన్‌పై ఆయన ఏమంటున్నారో ఈ వీడియోలో చూద్దాం రండి.