జెలసీ పెంచుకోవద్దు!
సినీరంగంలోని పోటీని స్ఫూర్తిగా తీసుకొని మరింత ఉత్తమమైన నటనను కనబరిచేందుకు ప్రయత్నించాలని.. అసూయతో రగిలిపోతే ఏమీ సాధించలేమని చెప్పింది పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్. కొన్నేళ్లక్రితం దక్షిణాదిన అగ్ర తారగా ఓ వెలుగువెలిగిన ఈ భామ ప్రస్తుతం తన మకాంను ముంబయికి మార్చింది. అక్కడ ఆరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాలన్నీ షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది రకుల్‌ప్రీత్‌సింగ్. ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని పోటీతత్వం గురించి మాట్లాడుతూ ‘వృత్తిపరంగా సహచర నాయికల విషయంలో నాకు ఎలాంటి అభద్రతాభావం లేదు. ప్రతిభకు అనుగుణంగా ఇక్కడ అవశాలు దక్కుతాయి. కొందరు అద్భుతమైన ప్రతిభతో రాణిస్తుంటారు. ‘మిమి’లో కృతిసనన్, ‘గంగూబాయి కథియావాడి’ చిత్రంలో అలియాభట్ అభినయం నన్నెంతగానో ఆకట్టుకుంది. వారిని స్ఫూర్తిగా తీసుకుంటే నటిగా నా పరిధుల్ని మరింత విస్తృతం చేసుకోవచ్చనే భావన కలిగింది. ఈర్ష్యతో రగిలిపోతే సమయం వృథా చేసుకోవడం తప్ప ఏమీ సాధించలేం’ అని చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్. ప్రస్తుతం ఆమె హిందీలో నటించిన అటాక్, రన్‌వే 34, మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ జీ, థాంక్గాడ్, ఛత్రీవాలీ..చిత్రాలు విడుదల సన్నాహాల్లో ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

