సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విమల్‌కృష్ణ దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న సినిమాను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు శనివారం కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. ఇందులో నేహాశెట్టి పాదాలకు ముద్దుపెడుతూ సిద్ధు జొన్నలగడ్డ కనిపిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘న్యూఏజ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఇది. డీజే టిల్లు అనే యువకుడి ప్రేమప్రయాణంలో ఎదురైన సంఘటనలు చక్కటి వినోదాన్ని పంచుతాయి. యువతరాన్ని మెప్పించే అన్ని హంగులుంటాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం’ అని తెలిపారు. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు.