అజయ్, వీర్తి వఘాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కొత్త కొత్తగా’. హనుమాన్ వాసంశెట్టి దర్శకుడు. మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మాత. ఈ చిత్రంలోని ‘డైమండ్ రాణి..’ పాటను శుక్రవారం దర్శకడు మారుతి విడుదల చేశారు. శేఖర్‌చంద్ర సంగీతాన్నందించిన ఈ గీతాన్ని కాసర్ల శ్యాం రచించారు. చక్కటి ప్రేమకథా చిత్రమిదని, త్వరలో విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. ఆనంద్, కాశీవిశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.