Cops Shot Dead By Colleague | పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద సహచరుడి కాల్పులు.. ఇద్దరు పోలీసులు మృతి
Cops Shot Dead By Colleague | పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న ఒక పోలీస్ తన సహచరులపై కాల్పులు జరిపాడు. తీవ్ర బుల్లెట్ గాయాలైన ఇద్దరు పోలీసులు మరణించారు. కాల్పుల్లో చనిపోయిన వారిలో ఒకరు ఆ పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్ఛార్జ్ అని సమాచారం.
గువాహతి: పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న ఒక పోలీస్ తన సహచరులపై కాల్పులు జరిపాడు. తీవ్ర బుల్లెట్ గాయాలైన ఇద్దరు పోలీసులు మరణించారు. కాల్పుల్లో చనిపోయిన వారిలో ఒకరు ఆ పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్ఛార్జ్ అని సమాచారం. సహచరులపై కాల్పులు జరిపిన ఆ పోలీస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Cops Shot Dead By Colleague) అస్సాంలోని కామరూప్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అస్సాం-మేఘాలయ సరిహద్దులోని ఒక పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న ఒక పోలీస్ గురువారం తెల్లవారుజామున తోటి పోలీసులపై కాల్పులు జరిపాడు. బోకో పోలీస్ స్టేషన్ పరిధిలోని గమేరిముర పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద ఉదయం 4 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఏకే 47 సర్వీస్ రైఫిల్‌తో జరిపిన ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మరణించారు.
కాగా, సహచర పోలీస్ కాల్పుల్లో మరణించిన వారిని ఇంద్రజిత్ బోరా, ఫజ్రుల్ అలీగా గుర్తించారు. గమేరిముర పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్ఛార్జ్ అధికారిగా ఇంద్రజిత్ వ్యవహరిస్తుండగా, హవల్దార్ హోదాలో అలీ ఉన్నారు. 29వ అస్సాం పోలీస్ బెటాలియన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ చిరంజీబ్ చౌదరి వారిపై కాల్పులు జరిపినట్లు సమాచారం.
మరోవైపు సీనియర్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీస్ కానిస్టేబుల్ చిరంజీబ్ చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. తన సహచరులపై అతడు ఎందుకు కాల్పులు జరిపాడో అన్నది దర్యాప్తు చేస్తున్నారు. అస్సాం-మేఘాలయ సరిహద్దులోని పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద కాల్పులు జరుగడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- Border Outpost
- colleague
- cops
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

