విక్కీకౌశల్తో తన ప్రేమబంధాన్ని పెళ్లిపీటలెక్కించేందుకు సిద్ధమవుతోంది బాలీవుడ్ అగ్రనాయిక కత్రినాకైఫ్. డిసెంబర్లో ఈ జంట ఏడడుగులు వేయబోతున్నట్లు సమాచారం. గత మూడేళ్లుగా విక్కీకౌశల్తో ప్రేమలో ఉన్నది కత్రినాకైఫ్. ఈ ప్రేమపక్షులు జంటగా విహారయాత్రలకు వెళ్లడమే కాకుండా పలు సినిమా వేడుకల్లో సన్నిహితంగా కనిపించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. గత ఆగస్ట్‌లో వీరి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లకూడదనే రహస్యంగా కుటుంబసభ్యుల సమక్షంలో రోకా వేడుకను నిర్వహించినట్లు చెబుతున్నారు. డిసెంబర్లో ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పెళ్లి పనులతో వీరు బిజీగా ఉన్నట్లు తెలిసింది. ఈ జంట పెళ్లి దుస్తులను సభ్యసాచి డిజైన్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలో తమ పెళ్లి గురించి కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలిసింది.