హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): గ్రేహౌండ్స్, అక్టోపస్ దళాలు తెలంగాణకే గర్వకారణమని డీజీపీ ఆనంద్ కొనియాడారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని ఆక్టోపస్ కమాండో శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన డీజీపీ కమాండోలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గ్రేహౌండ్స్కు సంబంధించి 708 సరెండర్డ్ పోస్టుల ప్రతిపాదన ప్రస్తుతం ప్రభు త్వ పరిశీలనలో ఉన్నదని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులకు వివరించారు.
గ్రేహౌండ్స్ సిబ్బంది సర్దుబాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన తర్వాతే వారిని మా తృ విభాగాలకు పంపే ప్రక్రియ చేపడుతామని స్పష్టం చేశారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిబ్బందికి అందిస్తున్న శిక్షణ ప్రమాణాలు, పాఠ్యాంశాలు, మాడ్యూల్స్ లో నిరంతరం ఆధునీకరణ ఉండాలని స్పష్టం చేశారు. ము ఖ్యంగా స్పె షల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్) బృందాల పనితీరును, శిక్షణ విభాగాన్ని డీజీపీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమావేశంలో ఎస్పీ(అడ్మిన్) ఎం.వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ(ఆపరేషన్స్) సీహెచ్ రఘునందన్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అధికారులు పాల్గొన్నారు.