నల్గొండ : కుటుంబ సభ్యులకు చెందిన భూములకు సంబంధించి సర్వే నివేదికను జారీ చేసేందుకు లంచం ( Bribe ) తీసుకున్న నల్గొండ ఆర్డీవో కార్యాలయ సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ( Deputy Inspector ) ను ఏసీబీ ( ACB Raid ) అధికారులు పట్టుకున్నారు. తల్లి, అత్తకు చెందిన భూముల సర్వే రికార్డు కోసం ఫిర్యాదుదారుడు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జి పవన్ కుమార్ను సంప్రదించగా రూ.35 వేలు లంచంగా డిమాండ్ చేశాడు.
ఇందులో భాగంగా మొదటి విడుతలో రూ.20 వేలు చెల్లించిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శుక్రవారం కలెక్టరేట్ వద్ద మిగతా రూ. 15 వేలు అందజేశాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదుచేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.