Akshara Gupta : ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ(Viabhav VSooryavanshi) మెరుపులను మరవక ముందే మరో అమ్మాయి ట్రిపుల్ సెంచరీతో రికార్డులు నెలకొల్పింది. పదిహేనేళ్ల వైభవ్ ఆటను తలపించే విధ్వంసంతో 15 ఏళ్ల అక్షర గుప్త (Akshara Gupta )ఏకంగా మూడొందలు కొట్టేసింది. తను కూడా బిహార్‌కు చెందిన క్రికెటరే కావడం విశేషం. బిహార్ ఉమెన్స్ అండర్-19 ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఈ అమ్మాయి భవిష్యత్ తారగా రికార్డులు నెలకొల్పింది.
బిహార్ క్రికెట్లో మరో తార ఆవిర్భవించింది. ఐపీఎల్లో రికార్డు శతకాలు బాదిన వైభవ్ సూర్యవంశీ తరహాలో రెచ్చిపోతూ.. బౌలర్ల భరతం పట్టిన అక్షర గుప్తా ట్రిపుల్ సెంచరీతో రికార్డుల దుమ్ము దులిపింది. 15 ఏళ్ల అక్షర.. 306 పరుగులతో మెరిసింది. బిహార్ అండర్ -19 వన్డే ట్రోఫీలో కేవలం 126 బంతుల్లోనే అక్షర 55 ఫోర్లు, 8 సిక్సర్లతో త్రిశతకం కొట్టేసింది.
Akshara Gupta with a knock for the ages in the BCA U19 One-Day Trophy 👏
An unbeaten 306* at a staggering strike rate of 242.86, including 55 fours and 8 sixes 🔥#CricketTwitter pic.twitter.com/CsBwIaM5qN
— Female Cricket (@imfemalecricket) June 19, 2026
2024లో బిహార్ అండర్-19 జట్టుకు ఎంపికైన అక్షర 14 ఏళ్లకే కెప్టెన్సీ చేపట్టింది. అంతేకాదు బీసీసీఐ ఒకే గ్రూప్ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా అక్షర గుర్తింపు సాధించింది. పద్నాలుగేళ్లకే పరిమిత ఓవర్లలో ట్రిపుల్ సెంచరీ కొట్టిన అక్షర.. ఏడాది తిరిగేలో మూడొందల స్కోర్‌తో సెలెక్టర్లను, క్రికెట్ అభిమానులను తనవైపు తిప్పుకుంది.