అహ్మదాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జూనియర్ వైద్యులపై ర్యాగింగ్ జరిగింది. ర్యాగింగ్ నిరోధక కమిటీ విచారణలో ఆరుగురు సీనియర్ డాక్టర్లను బాధ్యులుగా నిర్ధారించారు. దీంతో వారిని సస్పెండ్ చేశారు. (Doctors Suspended Over Ragging) గుజరాత్‌లోని భావనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ సంఘటన జరిగింది. ఆర్థోపెడిక్ సర్జరీ విభాగానికి చెందిన రెసిడెంట్ జూనియర్ వైద్యులను ఆపరేషన్ థియేటర్లో బహిరంగంగా శిక్షించారు. వారితో ముర్గాబంద్ చేయించారు.
కాగా, జూనియర్ వైద్యులపై ర్యాగింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ర్యాగింగ్ నిరోధక కమిటీ స్పందించింది. 8 గంటలకుపైగా సుదీర్ఘ సమావేశం నిర్వహించింది. 13 మంది వైద్య విద్యార్థుల ఆరోపణలను పరిశీలించారు. మూడవ సంవత్సరం రెసిడెంట్ వైద్యులు, అధ్యాపక, సహాయక సిబ్బందికి చెందిన సభ్యుల వాంగ్మూలాలను రికార్డ్ చేశారు.
మరోవైపు ఆరుగురు సీనియర్ వైద్యులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు కమిటీ నిర్ధారించింది. దీంతో జాతీయ వైద్య కమిషన్ ర్యాగింగ్ నిరోధక నిబంధనలు, గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా ఆదేశాలకు అనుగుణంగా వారిని సస్పెండ్ చేశారు. నిందితులలో ఒకరిని అన్ని విద్యా, వైద్య, పరిశోధన, కాలేజీ కార్యకలాపాల నుంచి రెండేళ్లపాటు బహిష్కరించారు. ముగ్గురిని ఒక సంవత్సరం పాటు, మరో ఇద్దరిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. సస్పెండైన ఆరుగురు డాక్టర్లు తమ హాస్టల్ వసతిని తక్షణమే ఖాళీ చేయాలని కాలేజీ యాజమాన్యం ఆదేశించింది.
The moment I received this CCTV picture from GMC Bhavnagar (Gujarat), my mind froze for a moment thinking how mentally and physically devastated these Orthopaedic surgery resident doctors must have felt at this moment when they were made a murgha openly in the Operation Theatre.… https://t.co/2CQo5Q8QdQ pic.twitter.com/1ZXIDQgkZr
— Dr.Dhruv Chauhan (@DrDhruvchauhan) June 19, 2026