న్యూఢిల్లీ : ఓ హత్య కేసులో చేయని నేరానికి నాలుగు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన భారత సంతతి వ్యక్తి సుబ్రహ్మణ్యం వేదంను దేశ బహిష్కరణ చేయడాన్ని నిలిపేయాలని వలస విభాగాన్ని రెండు అమెరికా కోర్టులు ఆదేశించాయి. వలస విభాగం అతడి కేసును సమీక్షించాలని అప్పీల్ చేసే వరకు అతడి దేశ బహిష్కరణను నిలిపేయాలని గత వారం ఇమ్మిగ్రేషన్ జడ్జి ఆదేశించారు.
అదే రోజు పెన్సిల్వేనియా డిస్ట్రిక్ట్ కోర్ట్ కూడా ఇదే విధమైన ఆదేశాలు జారీ చేసింది. 1980లో జరిగిన తన స్నేహితుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం 1982లో అరెస్ట్ అయ్యారు.