Demon Pawan | బిగ్ బాస్ సీజన్ 9 ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన కంటెస్టెంట్ డీమన్ పవన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కన్నుమూసిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులను కలచివేస్తోంది. ఈ విషయాన్ని పవన్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అభిమానులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో డీమన్ పవన్ తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సామాన్యుల కేటగిరీలో జరిగిన అగ్నిపరీక్ష ద్వారా ఎంపికై బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన పవన్, తన ధైర్యం, స్ట్రాంగ్ గేమ్‌తో ఫినాలే వరకు చేరి ప్రత్యేక గుర్తింపు పొందాడు. చివరికి టాప్–3లో నిలిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు.
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలోనే తన తండ్రి ఆరోగ్యం గురించి పవన్ భావోద్వేగంగా మాట్లాడాడు. తన తండ్రి నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని చెప్పి హౌస్‌లోనే ఎమోషనల్ అయిన సందర్భం ప్రేక్షకులను కదిలించింది. అప్పటినుంచి ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఆయన తండ్రి కన్నుమూసిన వార్త కుటుంబ సభ్యులను తీవ్ర దుఃఖంలో ముంచేసింది. ఈ విషాదాన్ని తెలియజేస్తూ పవన్ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. తండ్రి తనకు ఎంత ముఖ్యమో, జీవితంలో ఆయన ఇచ్చిన విలువలు ఎప్పటికీ మరవలేనివని పేర్కొంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు పవన్‌కు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 9లో పవన్ గేమ్ ప్రత్యేకంగా నిలిచింది. హౌస్‌లో రెండు సార్లు కెప్టెన్‌గా ఎంపిక కావడం ద్వారా తన లీడర్షిప్ను చూపించాడు. అదే సమయంలో హౌస్‌లో రీతూ చౌదరితో ఉన్న అనుబంధం కారణంగా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ తన ఆటతో ప్రేక్షకులను మెప్పించాడు. ఫైనల్ దశలో 15 లక్షల రూపాయల సూట్‌కేస్‌ను తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చిన పవన్ తన నిర్ణయంతో కూడా చర్చనీయాంశంగా నిలిచాడు. అయితే ఇప్పుడు ఆయన కుటుంబంలో చోటు చేసుకున్న ఈ విషాదం అభిమానులను బాధకు గురిచేస్తోంది. డీమన్ పవన్ తండ్రి మృతికి నెటిజన్లు, పలువురు టీవీ సెలబ్రిటీలు సంతాపం తెలుపుతూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు.