ఢిల్లీ నగరానికి ఎంతటి చరిత్ర ఉందో, ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో ఒక్కమాటలో చెప్పడం కష్టం. ఆ జ్ఞాపకాలు, ఆనవాళ్లు ఇప్పటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన.. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన అనుకృతి గుప్తా, తనూజ గత జూన్లో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఒకప్పటి ఫ్యామిలీ ఫొటోలు, చారిత్రక కట్టడాల ఫొటోలు, సామాజిక, సాంస్కృతిక విషయాలను ప్రతిబింబించే ఛాయా చిత్రాలు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నారు. అందులోనే ‘లివింగ్ మ్యూజియం ఆఫ్ ఢిల్లీ’ పేరుతో ఢిల్లీలోని ప్రజల అనుభవాలనూ భద్రపరుస్తున్నారు.
ఇప్పటికే 240 పోస్ట్లు పెట్టారు.