300 నుంచి 390కి పెంచుతూ జీవో జారీ
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రా్రష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ పారితోషికాన్ని ప్రభుత్వం పెంచింది. గంటకు రూ.300 నుంచి రూ.390కి పెంచుతూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం జీవో జారీచేశారు. ఒక అధ్యాపకుడికి నెలకు 72 గంటలు, రూ.28,800 మించకుండా చూసుకోవాలని జీవోలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 128 డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 1,160 మంది గెస్ట్ లెక్చరర్లకు లబ్ధిచేకూరనున్నది. ఈ నిర్ణయంపై తెలంగాణ గవర్నమెంట్ కాలేజీ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే సురేందర్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.