హత్యకేసులో అనుమానితుడిగా అరెస్ట్ అయిన డేగల బాబ్జీ కథేమిటో తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందేనని అంటున్నారు హాస్యనటుడు బండ్ల గణేష్. ఆయన హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘డేగల బాబ్జీ’. వెంకట్చంద్ర దర్శకుడు. స్వాతిచంద్ర నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సింగిల్ క్యారెక్టర్‌తో తెలుగు తెరపై రూపొందుతున్న తొలి చిత్రమిది. మిగతా పాత్రల వాయిస్ మాత్రమే వినిపిస్తుంది కానీ వారు తెరపై కనిపించరు. డేగల బాబ్జీగా బండ్ల గణేష్ చక్కటి అభినయాన్ని కనబరిచారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని, సంగీతం:లైనస్ మధిరి.