మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసిన డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సిన్నర్.. 2026 సీజన్‌ను విజయంతో ఆరంభించాడు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో రెండో సీడ్ ఇటలీ కుర్రాడు.. 6-2, 6-1తో హ్యుగొ గాస్టన్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. రెండు సెట్స్ తర్వాత గాస్టన్ గాయం కారణంగా వైదొలగడంతో సిన్నర్ రెండో రౌండ్‌కు ముందంజ వేశాడు. మెన్స్ సింగిల్స్‌లో అతడితో పాటు 9వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా).. 1-6 (7/5) 5-7, 6-1, 6-3తో వాలెంటిన్ రోయర్ (ఫ్రాన్స్)పై, లొరెంజొ ముసెట్టి (ఇటలీ) 4-6, 7-6 (7/3), 7-5, 3-2తో కొలింగ్నన్ (బెల్జియం)ను చిత్తుచేసి రెండో రౌండ్‌కు చేరారు.
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అమెరికా బామ మాడిసన్ కీస్.. 7-6 (8/6), 6-1తో ఒలెక్సాండ్ర (ఉక్రెయిన్)పై పోరాడి గెలిచింది. నవొమి ఒసాకా 6-3, 3-6, 6-4తో అంటోనియా రుజిక్ (క్రొయేషియా)పై గెలుపొందింది. ఐదో సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్థాన్) 6-4, 6-3తో జువన్ (స్లోవేనియా)ను ఓడించింది.