జూన్ 19 (నమస్తే తెలంగాణ) : దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి, ప్రజల గొంతుకను వినిపించడానికి శాంతి కమిటీల పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జస్టిస్ చంద్రకుమార్ కార్యాలయంలో శుక్రవారం శాంతిచర్చల కమిటీ, మాజీ మావోయిస్టు నేతల మధ్య సమావేశం జరిగింది.
అభివృద్ధి పేరుతో ఆదివాసీలను తరలించడాన్ని కమిటీ ఖండించింది. జల్-జంగిల్-జమీన్‌పై ఆదివాసీలకు ఉన్న హకులను కాపాడాలని సూచించారు. సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, ప్రొఫెసర్ అన్వర్, రహమాన్, వెంకన్న, ఖాన్, మాజీ మావోయిస్టు నేతలు దేవుజీ టీం పాల్గొన్నారు.